ఆధిక్యంలో ఇంగ్లాండ్.. మూడో రోజు కీలకం

Sat,September 14, 2019 01:22 PM

ఓవల్: యాషెస్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 225 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో స్వల్ప ఆధిక్యాన్ని(69) సాధించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రెండో పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ మూడో రోజు ఎన్ని పరుగలు సాధిస్తుందన్నది కీలకం. ఇప్పటికే 78 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ మ్యాచ్ గెలవాలంటే ఆస్ట్రేలియాకు గరిష్టంగా 450 పరుగుల వరకు లక్ష్యాన్ని నిర్ధేశించాలి. ఈ రోజు పూర్తిగా క్రీజులో ఉండి, నాలుగో రోజు తొలి సెషన్ వరకు వికెట్లు కాపాడుకుంటే ఇంగ్లాండ్ అనుకున్నంత లక్ష్యాన్ని నిర్ధేశిస్తుంది.


కెప్టెన్ రూట్, వికెట్ కీపర్ బట్లర్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీలతో రాణించడం ఇంగ్లాండ్‌కు శుభ పరిణామం. రెండో ఇన్నింగ్స్‌లో కూడా వారు స్థాయికి తగ్గట్లు ఆడి, మిగితా బ్యాట్స్‌మెన్ సహకరిస్తే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పైచేయి సాధిస్తుందనడంలో సందేహం లేదు.

839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles