ఇంగ్లాండ్ ఆసీస్‌ను నిలువరించగలదా..!

Wed,September 11, 2019 01:44 PM

England can restrict Aussies ..!

ఓవల్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఆస్ట్రేలియా మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే 2-1తో ట్రోఫీని నిలుపుకున్న ఆసీస్ చివరి మ్యాచ్ గెలిచి సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలని చూస్తోంది. ఆసీస్ ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ గెలిచి దాదాపు 20 సంవత్సరాలైంది. 2001లో స్టీవ్ వా సారథ్యంలో 4-1తో సిరీస్ గెలిచిన తరువాత ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌లో యాషెస్ గెలవలేదు. విజయవంతమైన కెప్టెన్‌ల వల్లే కానీ ఈ రికార్డుకు టిమ్‌పైన్ చేరువలో ఉన్నాడు. గతంలో గ్రెగ్ చాపెల్, రీకీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్‌ల సారథ్యంలో రెండేసి సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పటికీ వారు ట్రోఫీ దక్కించుకోలేదు.

ఆసీస్ విజయాల్లో సింహభాగం స్టీవ్ స్మిత్‌తే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే అతడు 134 యావరేజీతో 671 పరుగులు చేశాడు. ఆర్చర్ వేసిన బౌన్సర్‌కు గాయపడి మూడోటెస్టులో కాంకషన్ ఔట్‌గా వెనుదిరిగగా, మ్యాచ్ ఆసీస్ నుంచి చేజారింది. తిరిగి నాలుగో టెస్టులో తుది జట్టులో స్థానం దక్కించుకున్న స్టీవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా డబుల్ సెంచరీ సహా అర్ధసెంచరీతో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం తరువాత దాదాపు 14 నెలలు టెస్టు క్రికెట్‌కు దూరమైన స్మిత్ ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే తన విశ్వరూపం చూపించాడు. నిషేదానికి దూరమైన తర్వాత తన నుంచి ఇండియా కెప్టెన్ కోహ్లి లాక్కున్న నెంబర్ వన్ స్థానాన్ని తిరిగి సాధించాడు.

ఇక బౌలింగ్ విషయానికొస్తే ప్యాట్ కమిన్స్, హెజెల్ వుడ్‌తో పాటు స్టార్క్‌తో పేస్ దళం పటిష్టంగా ఉంది. లియాన్ స్పిన్‌తో మాయ చేయగలడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో స్మిత్, కమిన్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మొదటి ర్యాంక్‌లో నిలిచారు. ఇంగ్లాండ్ మాత్రం చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. కెప్టెన్ రూట్‌తో పాటు ఆల్‌రౌండర్ స్టోక్స్ మినహా ఫామ్‌లో ఎవరూ లేక పోవడం వారిలో ఆందోళన కలిగిస్తోంది.

692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles