ధోని రిటైర్మెంట్‌పై స్పందించిన చీఫ్‌ సెలెక్టర్‌

Thu,September 12, 2019 05:57 PM

ముంబయి: ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పై తమకు ఎలాంటి సమాచారం లేదని బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ అన్నారు. దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు సంబంధించి ఆటగాళ్ల జాజితా సెలెక్షన్‌ కమిటీ ప్రకటించింది . ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రసాద్‌.. ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వదంతుల గురించి స్పందించారు. ధోనీ ఇవాళ రాత్రి 7 గంట‌ల‌కు మీడియాను ఉద్దేశించి మాట్లాడ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ్యాపిస్తున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ పోస్టు చేసిన ఓ ట్వీట్ కూడా ధోనీ రిటైర్మెంట్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ.. రిటైర్మెంట్ వార్త‌లు పూర్తిగా అవాస్తవాలనీ, ఇలాంటి వార్తలను అభిమానులు పట్టించుకోకూడదని ఆయన అన్నారు. మ‌రోవైపు సౌతాఫ్రికాతో జ‌రిగే మూడు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ శ‌ర్మ‌ను ఎంపిక చేశారు. ఓపెన‌ర్‌గా రోహిత్‌కు అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు చీఫ్ సెల‌క్ట‌ర్ ఎంఎస్‌కే ప్ర‌సాద్ తెలిపారు.



1977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles