కెప్టెన్సీ నాపై ప్రభావం చూపదు: డీ కాక్‌

Tue,September 17, 2019 06:41 PM

మొహాలీ: దక్షిణాఫ్రికా టీ-20 కెప్టెన్‌గా ఎంపికైన క్వింటన్‌ డీ కాక్‌ మీడియాతో మాట్లాడారు. కెప్టెన్‌ భాద్యత నీ బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందా అని అడగగా.. అతను సమాధానమిస్తూ.. కెప్టెన్సీ నాపై, నా ఆటపై ప్రభావం చూపుతుందనుకోను. హోదా మారినంత మాత్రాన ఆటలో మార్పు వస్తుందని నేననుకోవడం లేదు. నేను ఎప్పటిటాగే బ్యాటింగ్‌ చేయగలను. సీనియర్‌ ఆటగాళ్లు ఫాఫ్‌ డూ ప్లెసీ, ఏ బీ డివిలియర్స్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. వాళ్లే నాకు స్ఫూర్తి. మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినందుకు నిరాశగా ఉంది. అయినప్పటికీ మిగితా రెండు మ్యాచ్‌లు గెలిచేందుకు ప్రయత్నిస్తాం. మా కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారని డీ కాక్‌ తెలిపాడు.


గత ఐపీఎల్‌లో డీకాక్‌ ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడం చాలా గర్వకారణం. ముంబయి ఇండియన్స్‌లో భాగమైనందుకు నేను అదృష్టవంతున్ని అని ఈ సందర్భంగా డీ కాక్‌ తెలిపాడు.

ఇంకా కాగిసో రబాడా, విరాట్‌ కోహ్లి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అని అడగగా.. వారిద్దరూ చాలా తెలివైన ఆటగాళ్లు. ఆయా విభాగాల్లో వారిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ ఆరోగ్యకరంగానే ఉంటుందని అన్నాడు. ఇండియా చాలా బలమైన జట్టు. ప్రపంచ నెంబర్‌వన్‌ ఆటగాళ్లు(కోహ్లి, బుమ్రా) వారి దగ్గరున్నారు. వారిని ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నట్లు ఈ కొత్త కెప్టెన్‌ తెలిపాడు.

854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles