ముందుగానే రాఖీ కట్టించుకున్న బుమ్రా..

Wed,August 14, 2019 10:48 AM

bumrah celebrates rakshabandhan two days before

ముంబయి: టీమ్‌ ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ జస్ప్రీత్‌ బుమ్రా రాఖీ పండుగను రెండు రోజులు ముందుగానే జరుపుకున్నాడు. తన సోదరి జుహికా రాఖీ కడుతున్న ఫోటో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన అతడు..రక్షాబంధన్‌ రోజు అందుబాటులో ఉండను కాబట్టి జుహికాతో పండుగ సంబరాలను ముందే జరుపుకున్నాను. సన్నిహితంగా, ప్రేమగా ఉండే తన సోదరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
త్వరలో భారత్‌ వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడబోతోంది. పండుగకు ముందుగానే బుమ్రా కరీబియన్‌ దేశానికి వెళ్లనున్నాడు. ఆగస్టు 22 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇండియా వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంతకు ముందు విండీస్‌తో ఆడిన టీ20 సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సిరీస్‌ల్లోనూ బుమ్రాకు విశ్రాంతి కల్పించారు.

1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles