షారూక్‌తో బ్రావో డ్యాన్స్.. వీడియో

Tue,September 10, 2019 05:05 PM

bravo dance with sharuk khan

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ కరీబియన్ దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో షారూక్ ‘ట్రిన్‌బాగో నైట్ రైడర్స్’ జట్టుకు యజమానిగా ఉన్నాడు. నైట్ రైడర్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు తదుపరి మ్యాచ్‌కి విరామం దొరకడంతో యజమాని షారూక్ జట్టు యాజమాన్యంతో పాటు ఆటగాళ్లకు పార్టీ ఇచ్చాడు. పడవలో నైట్ రైడర్స్ జట్టు నైట్ పార్టీ జాలీగా గడిపింది. ఇందులో భాగంగా షారూక్ సూపర్‌హిట్ సాంగ్ లుంగీడ్యాన్స్ పాటకు అతనితో పాటు డ్వేన్ బ్రావో స్టెప్పులేసి సహచరులను అలరించారు.

కాగా, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టీంలో జిమ్మీ నీషమ్‌తో పాటు సునీల్ నరైన్, దినేష్ రామ్‌దిన్, లెండల్ సిమ్మన్స్ తదితరులు ఉన్నారు. వారు డ్యాన్స్ చేస్తున్న వీడియో బ్రావో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

1488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles