భువనేశ్వర్ కుమార్ పట్టిన అద్భుత క్యాచ్ చూశారా..? వీడియో..!

Mon,August 12, 2019 11:05 AM

bhuvneshwar kumar stunning catch in second odi against west indies

ట్రినిడాడ్: ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ విండీస్‌పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. కాగా ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. విండీస్ ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని ఆడిన వెస్టిండీస్ ప్లేయర్ ఛేజ్ బంతిని స్ట్రెయిట్ డ్రైవ్‌గా తరలించబోయాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దీంతో బంతిని భువనేశ్వర్ కుమార్ ఒడిసి పట్టాడు. ఈ క్రమంలో భువీ ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. కాగా ఈ క్యాచ్ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 4 వికెట్లు తీసిన భువీ భారత్ మ్యాచ్ గెలవడంలో తన వంతు పాత్రను పోషించాడు. కాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దవగా రెండో వన్డేలో భారత్ గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఈ సిరీస్‌లో 3వ వన్డే కూడా ఇదే క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఈ నెల 14వ తేదీన జరగనుంది.

4999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles