పింక్ టెస్టుపై కలగంటున్న రహానె..

Tue,November 19, 2019 01:16 PM

ముంబై: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు కోహ్లీసేన సిద్ధమవుతోంది. టీమ్‌ఇండియా గులాబీ టెస్టులోనూ అదరగొట్టాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా భారత ఆటగాళ్లు గులాబీ బంతితో సాధన చేస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు శుక్రవారం ఆరంభంకానుంది. ఈ టెస్టుపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. భారత క్రికెటర్లు, అభిమానులు దీనిపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబీ బంతితో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు టీమ్ సభ్యులు చెబుతున్నారు.


తొలి డే/నైట్ టెస్టు గురించి కలగంటున్నట్లు టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ ఆజింక్య రహానె అంటున్నాడు. 'చరిత్రాత్మక పింక్ బాల్ టెస్టు గురించి కలగంటున్నట్లు' ట్వీట్ చేస్తూ గులాబీ బంతిని తన పక్కన పెట్టుకొని నిద్రిస్తున్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఐతే రహానె పోస్ట్‌పై స్పందించిన కోహ్లీ.. 'నైస్ పోజ్ జింక్సీ' అని కామెంట్ పెట్టగా.. 'కలల కంటున్నప్పుడు తీసిన ఫొటో ఇది' అని ధావన్ సరదాగా వ్యాఖ్యానించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రహానె, రోహిత్ శర్మ బుధవారం ఉదయంలోగా కోల్‌కతా చేరుకోనున్నారు. మిగతా టీమ్ సభ్యులతో పాటు బంగ్లా క్రికెటర్లు మంగళవారం అక్కడికి వెళ్తారు.

690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles