ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం

Mon,September 9, 2019 06:18 PM

afnisthan huge victory against bangladesh

చిట్టగాంగ్: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆతిథ్య బంగ్లా ఘోరంగా ఓడిపోయింది. 398 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 173 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు పకడ్బందీగా బంతులేస్తూ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కోలుకోనీయలేదు. బంగ్లా బ్యాట్స్‌మెన్ పేలవమైన ఆటతీరుతో చిత్తుగా ఓడింది. ఓపెనర్ షద్మాన్ ఇస్లాం(41), షకీబ్ అల్ హసన్(44) కాసేపు పోరాడారు. మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ 6 వికెట్లతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. జహీర్‌ఖాన్ 3 వికెట్లతో రాణించాడు.

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు టెస్టు కేరీర్‌లో రెండో విజయం నమోదు చేసినట్లయింది. ఇంతకు ముందు ఇండియాతో తలపడిన ఏకైక టెస్టులో ఓడిపోయిన ఆఫ్ఘన్, ఈ ఏడాది మార్చిలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గెలిచింది.

1536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles