తమ రికార్డును తామే బ్రేక్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌

Mon,September 16, 2019 04:06 PM

ఢాకా: ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు టీ-20ల్లో విజయ యాత్రను కొనసాగిస్తున్నది. బంగ్లాదేశ్‌, జింబాంబ్వేలతో జరుగుతున్న ట్రై సిరీస్‌లో అదరగొడుతున్న ఆఫ్ఘాన్‌ బంగ్లాతో నిన్న జరిగిన టీ-20 మ్యాచ్‌లో నబీ విజృంభనతో 25 పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్‌ టీ-20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది.


2016-17 సీజన్‌లో వరుసగా 11విజయాలు సాధించిన ఆఫ్ఘన్‌ తాజా విజయంతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ విజయంతో వరుసగా 12 విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది.


2548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles