తొలి టెస్టులో ఇండియా ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు..

Mon,October 7, 2019 12:01 PM

విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో భారత్‌ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ 203 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో, 3 టెస్టుల సిరీస్‌లో ఇండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీల మోత మోగించిన రోహిత్‌ శర్మ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.


ఈ మ్యాచ్‌లో ఇండియా ఆటగాళ్ల రికార్డులు:

* ఈ విజయంలో ఇండియా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 160 పాయిట్లతో టాప్‌
పొజిషన్‌ను నిలబెట్టుకుంది.

* టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు.

* మయాంక్‌ అగర్వాల్‌ స్వదేశంలో ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీని డబుల్‌ సెంచరీగా మలిచి అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. దీంతో, దిలీప్‌ సర్ధేశాయ్‌, వినోద్‌ కాంబ్లి, కరుణ్‌ నాయర్‌ల సరసన చేరాడు.

* ఈటెస్టు మ్యాచ్‌లో ఇండియా, సౌతాఫ్రికా సంయుక్తంగా అత్యధిక సిక్సర్లు(37) నమోదు చేశాయి. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌, న్యూజీలాండ్‌(35 సిక్సర్లు) పేరిట ఉంది.

* ఈ మ్యాచ్‌తో అశ్విన్‌ 350 వికెట్ల క్లబ్‌లో చేరాడు. భారత్‌ తరఫున అతి తక్కువ మ్యాచ్‌ల్లో అశ్విన్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు 5 వికెట్లు సాధించిన బౌలర్‌గానూ అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. అశ్విన్‌ కన్నా ముందు మురళీధరన్‌45 సార్లు 5 వికెట్లు సాధించాడు.

* ఈ మ్యాచ్‌తో రవీంద్ర జడేజా 150 వికెట్లు సాధించిన మూడో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా రికార్డు సాధించాడు. జడేజా కన్నా ముందు హెరాత్‌, వెటోరీ ఉన్నారు.

*ఒక టెస్టులో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ వసీమ్‌ అక్రమ్‌(12 సిక్సర్లు) రికార్డును సమం చేశాడు.

* ఒక టెస్టులో రెండు సెంచరీలు బాదిన ఆరో బ్యాట్‌మెన్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు విజయ్‌ హజారే, సునీల్‌ గవాస్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌, విరాట్‌ కోహ్లి, అజింక్యా రహానే ఈ ఫీట్‌ను సాధించారు.

* మయాంక్‌, రోహిత్‌ 300+ తొలి వికెట్‌ భాగస్వామ్యం సాధించి రికార్డు సృష్టించారు.

* ఇండియా, సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్‌లో అత్యధిక తొలి వికెట్‌ భాగస్వామ్యం సాధించిన ఓపెనర్లుగా మయాంక్‌, రోహిత్‌ రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు 1996లో గ్యారీ కిరిస్టెన్‌, హడ్సన్‌ 236 పరుగుల రికార్డును భారత్‌ ఓపెనింగ్‌ జోడీ బద్దలు కొట్టింది.

2142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles