Voyager-1 | భూమికి ఒక లైట్ డే దూరంలోకి వాయేజర్-1.. 49 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..!
Voyager-1 | అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ప్రయోగించిన వాయేజర్-1 (Voyager-1) అద్భుత రికార్డు నెలకొల్పింది. 1977లో ప్రయోగించిన ఈ ఖగోళ పరిశోధక వ్యోమనౌక (Space Craft) 49 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భూమి నుంచి సరిగ్గా ఒక ‘లైట్ డే (Light Day)’ దూరంలోకి (కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరానికి) చేరుకుంది.
Voyager-1 : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ప్రయోగించిన వాయేజర్-1 (Voyager-1) అద్భుత రికార్డు నెలకొల్పింది. 1977లో ప్రయోగించిన ఈ ఖగోళ పరిశోధక వ్యోమనౌక (Space Craft) 49 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భూమి నుంచి సరిగ్గా ఒక ‘లైట్ డే (Light Day)’ దూరంలోకి (కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరానికి) చేరుకుంది. అంటే దాదాపు 2,600 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్లింది. దాంతో ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్-1 గుర్తింపు దక్కించుకుంది.
ఈ వ్యోమనౌక అంతరిక్షంలో గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నదని నాసా వెల్లడించింది. సౌర వ్యవస్థ వెలుపలి ప్రాంతాన్ని, సూర్యుడి హెలియోస్పియర్కు ఆవలి ప్రాంతాలను, నక్షత్ర మండలాల మధ్య ఉండే విస్తారమైన అంతరిక్ష ప్రాంతాన్ని అధ్యయనం చేసేందుకు వాయేజర్ ప్రయోగ ప్రక్రియ నాసా చేపట్టింది. ఈ ప్రయోగ ప్రకియలో భాగంగా 1977 సెప్టెంబర్ 5న వాయేజర్-1 ను ప్రయోగించింది. అప్పటి నుంచి అది అంతరిక్షంలో ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నది.
1979లో గురుడు, 1980లో శని గ్రహాలను దాటేసిన ఈ పరిశోధక నౌక వాయేజర్-1 2012లో సౌర మండలాన్ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి వెళ్లింది. ఈ వ్యోమనౌక ఒక కాంతి సంవత్సరం దూరం వెళ్లడానికి మరో 18 వేల ఏళ్లు పడుతుందని నాసా అంచనా వేసింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
Voyager-1 | భూమికి ఒక లైట్ డే దూరంలోకి వాయేజర్-1.. 49 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సర్పంచ్
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

