డీఎస్సీ ప్రత్యేకం బయాలజీ
1. మూత్రపిండం క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణాలు?
1) న్యూరాన్లు 2) నెఫ్రాన్లు
3) వాయుగోణులు 4) ట్రాకియాలు
2. మానవుల్లో విసర్జక అవయవం కానిది?
1) కాలేయం 2) ఊపిరితిత్తులు
3) చిన్నప్రేగు 4) పెద్ద ప్రేగు
3. మానవుడు రోజుకి విసర్జించే మూత్ర పరిమాణం?
1) 1.3-1.4 లీటర్లు
2) 1.6-1.8 లీటర్లు
3) 1.9-2.0 లీటర్లు
4) 5 లీటర్లు
4. మూత్రంలో నీటి శాతం?
1) 76 శాతం 2) 86 శాతం
3) 96 శాతం 4) 90 శాతం
5. అత్యంత విషపూరిత విసర్జక పదార్థం?
1) అమ్మోనియా 2) యూరియా
3) యూరిక్ ఆమ్లం 4) గ్వానిన్
6. కృత్రిమ మూత్రపిండం : లియం కోల్ఫ్ :: మార్పిడి: …
1) క్రిస్టియన్ బెర్నార్డ్
2) చార్లెస్ హాఫ్నగెల్
3) అండీముర్రే
4) విలియం జె.కాఫ్
7. యూరియా తయారయ్యే భాగం
1) కాలేయం 2) క్లోమం
3) మూత్రపిండం 4) ఊపిరితిత్తులు
8. మూత్రపిండాలు పనిచేయక పోవడాన్ని ఏమంటారు?
1) ఎస్ఈడీఆర్ 2) ఆర్ఈఎస్డీ
3) ఈఎస్ఆర్డీ 4) డీఎస్ఆర్ఈ
9. యూరేమియా వ్యాధి లక్షణం కానిది?
1) నీరసం 2) అలసట
3) కాళ్లు, చేతులు ఉబ్బుట
4) పచ్చ కామెర్లు
10. భౌమన్స్ గుళిక గోడల్లో ఉండే కణాలు?
1) సైటోబ్లాస్టులు
2) ఇడియో బ్లాస్టులు
3) పోడోసైట్లు 4) పైవన్నీ
11. మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం?
1) బైలు రూబిన్ 2) బైలు వర్డిన్
3) వెనెడియం 4) యూరోక్రోమ్
12. అతి మూత్ర వ్యాధికి కారణమైన హార్మోన్?
1) ఇన్సులిన్ 2) గ్లూకాగాన్
3) వాసోప్రెస్సిన్ 4) అక్సిటోసిన్
13. డయాలసిస్ దేని కోసం వాడతారు?
1) మూత్రపిండాల క్షీణత
2) గుండె బలహీనత
3) మెదడువాపు
4) హీమోఫీలియా
14. కింది వాటిని జతపరచండి.
1) ఊపిరితిత్తులు ఎ) లవణాలు (కాల్షియం, మెగ్నీషియం)
2) చర్మం బి) పైత్యరస వ్యర్థాలు
3) కాలేయం సి) సెబం
4) పెద్ద పేగు డి) నీటి ఆవిరి
ఇ) ఆక్సిజన్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఇ
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-ఇ
15. ఒక వ్యక్తికి కాళ్లు చేతులు ఉబ్బిపోయాయి. నీరసం, అలసట వస్తుంది. అయితే అతనిలో ఈ అవయవం పాడై ఉండవచ్చు.
1) మూత్ర పిండం 2) మెదడు
3) గుండె 4) కాలేయం
16. మొదటసారి విసర్జక అవయవాలు ఏర్పడిన వర్గం?
1) అనెలిడా 2) అర్ధ్రోపొడా
3) ప్లాటిహెల్మింథిస్
4) నిమాటి హెల్మింథిస్
17. కింది ఏ జీవుల్లో కణ ద్రవాభిసరణ ద్వారా విసర్జక క్రియ జరుగును?
1) చేపలు
2) అమీబా, పారమీషియం
3) పక్షులు 4) బొద్దింకలు
18. మూత్రాశయంలో గరిష్టంగా నిల్వ ఉండే మూత్ర పరిమాణం?
1) 600-700 లీ.
2) 700-800 మి.లీ.
3) 1000-1200 మి.లీ
4) లీటరు
19. డయాలిస్ ప్రక్రియలో వాడని పదార్థాలు / పరికరం.
1) హిపారిన్ 2) డయలైజర్
3) సెల్లోఫేన్ నాళిక 4) స్టెతస్కోప్
20. మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం?
ఎ) మూత్ర పిండాలు
బి) మూత్ర నాళాలు
సి) ప్రసేకం
డి) మూత్రాశయం
1) ఎ, బి, డి, సి 2) ఎ, బి, సి, డి
3) డి, సి, బి, ఎ 4) ఎ, సి, డి, బి
21. కింది వాటిని జతపరచండి.
1) భౌమన్ గుళిక ఎ) నీటి పునఃశోషణం
2) సమీపస్థ సంవళిత నాళం బి) గుచ్ఛగాలనం
3) హెన్లీశిక్యం సి) వరణాత్మక పునఃశోషణం
4) దూరస్థ సంవళిత నాళం డి) నాళికాస్రావం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
22. నెఫ్రాన్లో ప్రాథమిక మూత్రం ఏర్పడే భాగం?
1) భౌమన్ గుళిక
2) సమీపస్థ సంవళిత నాళం
3) దూరస్థ సంవళిత నాళం
4) హెన్లీశిక్యం
23. మూత్రం గాఢత చెందే ప్రదేశం?
1) భౌమన్ గుళిక
2) హెన్లీశిక్యం
3) దూరస్థ సంవళిత నాళం
4) సమీపస్థ సంవళిత నాళం
24. ప్రాథమిక మూత్రం రక్తంలో విభేదించే అంశం?
1) వ్యర్థాలు ఉండవు
2) లవణాలు ఉండవు
3) రక్తకణాలు ఉండవు
4) ప్రొటీన్స్ ఉండవు
25. మూత్రపిండాలపైన అమరి ఉన్న టోపిలాంటి అంత:స్రావక గ్రంథి?
1) పీయూష గ్రంథి
2) థైరాయిడ్ గ్రంథి
3) క్లోమ గ్రంథి
4) అడ్రినల్ గ్రంథి
26. మూత్రం పీహెచ్ విలువ?
1) 4 2) 5 3) 6 4) 7
27. మూత్రంలో నీటి పున:శోషణకు తోడ్పడే హార్మోన్?
1) వాసోప్రెస్సిన్ 2) అడ్రినలిన్
3) టెస్టోస్టిరోన్ 4) ఎంఎస్హెచ్
28. మూత్రం ఏర్పడే దశల క్రమం?
1) వరణాత్మక పునఃశోషణం –
గుచ్ఛగాలనం -నాళికాస్రావం
2) గుచ్ఛగాలనం – వరణాత్మక
పునఃశోషణం – నాళికాస్రావం
3) నాళికాస్రావం – గుచ్ఛగాలనం –
వరణాత్మక పునఃశోషణం
4) నాళికాస్రావం – వరణాత్మక పునఃశోషణం – గుచ్ఛగాలనం
29. ఈఎస్ఆర్డీ వ్యాధి లక్షణాలు?
1) రెండు మూత్ర పిండాలు
పనిచేయకపోవడం
2) శరీరంలో నీరు, వ్యర్థపదార్థాలు
పేరుకుపోవడం వల్ల కాళ్లు,
చేతులు ఉబ్బడం
3) రక్త శుద్ధి కాకపోవడం
వల్ల నీరసం అలసట కలగడం
4) పైవన్నీ
సమాధానాలు
1-2 2-3 3-2 4-3
5-1 6-2 7-1 8-3
9-4 10-3 11-4 12-3
13-1 14-2 15-1 16-3
17-2 18-2 19-4 20-1
21-2 22-1 23-3 24-3
25-5 26-3 27-1 28-2
29-4
1. నాడీ వ్యవస్థలో గల నాడీ కణాల సంఖ్య సుమారుగా ?
1) 5 బిలియన్లు 2) 10 బిలియన్లు
3) 15 బిలియన్లు 4) 20 బిలియన్లు
2. మానవ శరీరంలో అతిపొడవైన, విభజన శక్తి లేని కణం
1) అండం 2) శుక్ర కణం
3) నాడీ కణం 4) కాలేయ కణం
3. మెదడు బరువు దాదాపుగా ఎంత ఉంటుంది?
1) 1000 గ్రాములు
2) 1100 గ్రాములు
3) 1200 గ్రాములు
4) 1400 గ్రాములు
4. అసంకల్పిత ప్రతీకార చర్యలను చూపే శరీరభాగం?
1) మెదడు 2) వెన్నుపాము
3) మజ్జాముఖం 4) మస్తిష్కం
5. గ్రీకులు మెదడు నియంత్రణ ప్రతిపాదించి భావనను తప్పుబట్టిన శాస్త్రవేత్తలు?
1) లియోనార్డో డావిన్సీ
2) స్టీఫెన్ హేల్స్
3) 1, 2 4) గలెన్
6. మెదడు నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు?
1) న్యూరాలజిస్ట్ 2) కార్డియాలజిస్ట్
3) నెఫ్రాలజిస్ట్ 4) పల్మనాలజిస్ట్
7. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపేవి?
1) ఎంజైమ్లు 2) హార్మోనులు
3) నాడులు 4) రక్తం
8. ఆలోచనలకు, తెలివి తేటలకు కేంద్రం?
1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం
3) ద్వారగోర్థం 4) మజ్జాముఖం
9. అనియంత్రిత చర్యలను నియంత్రించేది?
1) మజ్జాముఖం 2) అనుమస్తిష్కం
3) స్వయం చోదిత నాడీవ్యవస్థ
4)1, 3
10. పరధీయ నాడుల సంఖ్య
1) 12 జతలు 2) 31 జతలు
3) 43 జతలు 4) 46 జతలు
11. హృదయ స్పందనను నియంత్రించే మెదడు భాగం?
1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం
2) మజ్జాముఖం 4) ద్వారాగోర్థం
12. శరీర పరిమాణంతో పోల్చినపుడు అతిపెద్ద మెదడును కలిగి ఉండే జీవి?
1) కోతి 2) మానవుడు
3) అపోజం 4) నీలి తిమింగలం
13. ఒక వ్యక్తి తన భావావేశాలపై నియంత్రణ కోల్పోయాడు. అయితే అతని మెదడుల ఏ భాగం పనిచేయటం లేదు.
1) మస్తిష్కం 2) ద్వారగోర్థం
3) మధ్యమెదడు 4) అనుమస్తిష్కం
14. మధుమేహానికి సంబంధించిన గ్రంథి?
1) థైరాయిడ్ 2) క్లోమం
3) అధివృక్క గ్రంథి 4) పీయూష గ్రంథి
15. మెదడుపై రక్షించే నిర్మాణం?
1) కపాలం 2) మెనింజస్
3) మస్తిష్క మేరు ద్రవం
4) పైవన్నీ
16. శరీర మొత్తం బరువులో మెదడు బరువు శాతం?
1) 20 శాతం 2) 10 శాతం
3) 2 శాతం 4) 25 శాతం
17. రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే సందర్భం?
1) కోపం వచ్చినపుడు
2) ఉద్వేగం కలిగినపుడు
3) భయపడినపుడు 4) పైవన్నీ
18. కింది వాటిలో పోరాట-పలాయన హార్మోన్
1) థైరాక్సిన్ 2) అడ్రినలిన్
3) టెస్టోస్టిరాన్ 4) ఈస్ట్రోజన్
19. కింది వాటిలో నాళ సహిత గ్రంథి?
1) పీయూష గ్రంథి
2) థైరాయిడ్ గ్రంథి
3) స్త్రీబీజకోశం 4) క్లోమం
20. హార్మోన్లకు నామకరణం చేసిన శాస్త్రవేత్త?
1) లూయీపాశ్చర్
2) ఆగస్ట్ వీజ్మాన్
3) జీర్ణ నాడీవ్యవస్థ
4) కేంద్ర నాడీ వ్యవస్థ
21. మానవుడిలో రెండో మెదడుగా పరిగణించే వ్యవస్థ?
1) రక్త ప్రసరణ వ్యవస్థ
2) విసర్జక వ్యవస్థ
3) జీర్ణ నాడీవ్యవస్థ
4) కేంద్ర నాడీవ్యవస్థ
22. క్లోమ గ్రంథి నిర్మాణంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త?
1) స్టార్లింగ్ 2) బేట్సన్
3) విలియం హార్వే
4) పాల్లాంగర్ హాన్స్
23. ఒక విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం వింటూ రాస్తున్నాడు. అతడిలో అవయవాల మధ్య సమన్వయ క్రమం?
1) కళ్లు – ముక్కు – నాలుక
2) చెవులు – మెదడు – చేయి
3) చేయి -చర్మం – కళ్లు
4) కాళ్లు – చర్మం – మెదడు
సమాధానాలు
1-2 2-3 3-4 4-2
5-3 6-1 7-3 8-1
9-4 10-3 11-3 12-2
13-2 14-2 15-4 16-3
17-4 18-2 19-4 20-3
21-3 22-4 23-2 24-4
– ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..