న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ (UGC NET) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in. వెబ్సైట్లో చూడవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ప్రతి ఏడాది రెండు పర్యాయాలు ఎన్టీఏ నిర్వహిస్తున్నది.
ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ 6 నుంచి 19 వరకు మొత్తం 83 సబ్జెక్టులకు ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 9,45,918 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 3న ప్రాథమిక కీని విడుదల చేసింది.