పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు


Fri,November 29, 2019 12:45 AM

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


పోస్టు: డిప్లొమా ట్రెయినీ
-మొత్తం ఖాళీలు: 35
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-30, సివిల్-5 ఉన్నాయి.
-అర్హతలు: జనరల్ అభ్యర్థులు కనీసం 70 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 డిసెంబర్ 16 నాటికి 27 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 16
-వెబ్‌సైట్: http://powergridindia.com

ఇంటర్ ప్రవేశాలు

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) 2020-21 విద్యాసంవత్సరానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.

-కోర్సు: ఇంటర్ ఫస్ట్ ఇయర్
-కాలేజీల సంఖ్య: రాష్ట్రంలోని 28 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
-అర్హతలు: మార్చి-2020లో పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు.
-వయస్సు: 2020, ఆగస్టు 31 నాటికి 17 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: లెవెల్-1, లెవెల్-2 ప్రవేశ పరీక్షల
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: రూ.100/-
చివరితేదీ: డిసెంబర్ 20
పరీక్షతేదీలు: లెవెల్-1
ప్రవేశ పరీక్ష-2020, జనవరి 5.
లెవెల్-2 ప్రవేశపరీక్ష-2020,
ఫిబ్రవరి 9
వెబ్‌సైట్: https://www.tswreis.in

868
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles