ఎయిర్‌ఫోర్స్ క్యాట్ 2020


Wed,November 27, 2019 12:21 AM

ఎయిర్‌ఫోర్స్.. ఆకాశమంత

అవకాశాలు. పదోతరగతి నుంచి పట్టభద్రుడి వరకు పలు ఉద్యోగాలకు వాయుసేన ఏటా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం పలు బ్రాంచీల్లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (క్యాట్)-2020/ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్‌ను ఎయిర్‌ఫోర్స్ విడుదల చేసింది. దీని వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...
Airforce

ఏఎఫ్ క్యాట్: ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్. ఏటా ఈ టెస్ట్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు-249

బ్రాంచీలవారీగా ఖాళీలు:
-ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ
-బ్రాంచీ: ఫ్లయింగ్
-ఖాళీలు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)-60
-బ్రాంచీ: గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)
-ఖాళీలు : ఏఈ (ఎల్)-పర్మినెంట్ కమిషన్ (పీసీ) -40, ఎస్‌ఎస్‌సీ-26
-ఏఈ (ఎం)-పీసీ-23, ఎస్‌ఎస్‌సీ-16
-బ్రాంచీ: గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)
-ఖాళీలు: అడ్మిన్- పీసీ-24, ఎస్‌ఎస్‌సీ-16
-అకౌంట్స్-పీసీ-14, ఎస్‌ఎస్‌సీ-10
-లాజిస్టిక్స్-పీసీ-12, ఎస్‌ఎస్‌సీ-8

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ:
బ్రాంచీ: ఫ్లయింగ్
ఖాళీలు: సీడీఎస్‌ఈ ఖాళీల్లో 10 శాతం పీసీ కింద, ఏఎఫ్ క్యాట్‌లో 10 శాతం ఖాళీలను ఎస్‌ఎస్‌సీ కింద భర్తీ చేస్తారు.

ఎవరు అర్హులు?

-డిగ్రీ, బీఈ/బీటెక్, బీకాంతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉండాలి.
-ఫ్లయింగ్ బ్రాంచీకి 20-24 ఏండ్ల మధ్య, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీకి 20-26 ఏండ్ల మధ్య ఉండాలి.
-నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు అయి ఉండాలి.
-ఎంపిక విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, వైద్యపరీక్షల ఆధారంగా చేస్తారు.
-శిక్షణ: 2021 జనవరి నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, దుండిగల్ (హైదరాబాద్)లో శిక్షణ ఇస్తారు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచీకి 74 వారాలు, నాన్ టెక్నికల్ బ్రాంచీకి 52 వారాల శిక్షణ ఇస్తారు.
-పే అలవెన్స్‌లు: ఫ్లయింగ్ ఆఫీసర్- లెవల్ 10 నెలకు కింద రూ.56,100-11,0700/-

ముఖ్యతేదీలు:
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 1 నుంచి ప్రారంభం
-చివరితేదీ: 2019, డిసెంబర్ 31
-ఫీజు: రూ.250/-
-వెబ్‌సైట్: https://afcat.cdac.in

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1195
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles