ఎన్‌సీబీఎస్‌ పరిశోధన పరీక్షలు


Wed,November 6, 2019 02:48 AM

students
జాతీయస్థాయి సంస్థల్లో పరిశోధనలు చేయడానికి ప్రవేశం కల్పించే టీఐఎఫ్‌ఆర్‌ జీఎస్‌, జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ ఎంట్రెన్స్‌ ప్రకటనలు విడుదలయ్యాయి. ఈ ఎంట్రెన్స్‌లలో అర్హత సాధించినవారు పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. వీటికి సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...


టీఐఎఫ్‌ఆర్‌ జీఎస్‌-2020

- ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ (ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ), పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కోసం నిర్వహించే నేషన్‌వైడ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జీఎస్‌-2020)ని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) విడుదల చేసింది.
- సబ్జెక్టులు: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌&సిస్టమ్స్‌ సైన్సెస్‌, సైన్స్‌ ఎడ్యుకేషన్‌.
- స్టయిఫండ్‌: పీహెచ్‌డీ వారికి-మొదటి ఏడాది నెలకు రూ. 31,000 ఇస్తారు. తర్వాత అభ్యర్థుల ప్రగతిని బట్టి నెలకు రూ.35 వేలు ఇస్తారు.
- ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ వారికి- నెలకు రూ. 21,000/-
- ఎమ్మెస్సీ (బయాలజీ) అభ్యర్థులకు నెలకు రూ.16,000తోపాటు హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. ఎమ్సెస్సీ
(వైల్డ్‌లైఫ్‌ బయాలజీ&కన్జర్వేషన్‌) అభ్యర్థులకు నెలకు రూ.12,000/- ఇస్తారు.
- అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు/పీజీ, బీఈ/బీటెక్‌, చేసినవారు అర్హులు.
- ఎంపిక: దేశవ్యాప్తంగా నిర్వహించే జీఎస్‌-2020, ఇంటర్వ్యూల ఆధారంగా
- పరీక్షతేదీ: డిసెంబర్‌ 8

నోట్‌: డిసెంబర్‌ 8 ఉదయం సెషన్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్స్‌ సైన్సెస్‌, ఎమ్మెస్సీ (వైల్డ్‌లైఫ్‌ బయాలజీ) పరీక్షను నిర్వహిస్తారు. మధ్యాహ్నం సెషన్‌లో జేజీఈఈబీఐఎల్‌ఎస్‌, మ్యాథ్స్‌ పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, వారణాసి, పుణె, పట్నా, నాగ్‌పూర్‌,కాన్పూర్‌, జమ్ము, అగర్తల, అహ్మదాబాద్‌, చెన్నై, బెంగళూరు, మంగళూరు, మధురై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, కొచ్చిన్‌, భిలాయ్‌, భువనేశ్వర్‌, చండీగఢ్‌.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 20
- వెబ్‌సైట్‌: https://www.ncbs.res.in

జేజీఈఈబీఐఎల్‌ఎస్‌

జాయింట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ బయాలజీ అండ్‌ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్‌ సైన్సెస్‌ (జేజీఈఈబీఐఎల్‌ఎస్‌) నోటిఫికేషన్‌ను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయలాజికల్‌ సైన్సెస్‌ (ఎన్‌సీబీఎస్‌) విడుదల చేసింది.
- పార్టిసిపేటింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌: ఏసీటీఆర్‌ఈసీ, అశోకా యూనివర్సిటీ, బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌, సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, ఐసర్‌ (కోల్‌కతా, పుణె, తిరువనంతపురం, తిరుపతి), చెన్నై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, బెంగళూరు ఇన్‌స్టెమ్‌, ఎంఎస్‌ఎల్‌ఎస్‌, ఎన్‌బీఆర్‌సీ, ఎన్‌సీసీఎస్‌, ఎన్‌ఐబీఎంజీ, ఎన్‌ఐఐ, నైసర్‌, ఆర్‌సీబీ, ఎస్‌ఐఎన్‌పీ, టీఐఎఫ్‌ఆర్‌ (ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌).
- ప్రోగ్రామ్స్‌: పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ రిసెర్చ్‌.
- పరీక్ష తేదీ: డిసెంబర్‌ 8
- ఈ పరీక్షలో వచ్చిన స్కోర్‌తో ఆయా ఇన్‌స్టిట్యూట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను టీఐఎఫ్‌ఆర్‌ కోఆర్డినేట్‌ చేస్తుంది.
- పరీక్షతేదీలు: రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంది.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 20
- ఫీజు: రూ.900/-
- వెబ్‌సైట్‌: http://univ.tifr.res.in

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

749
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles