విద్యుత్‌ కొలువుల మేళా!


Wed,October 2, 2019 02:42 AM

electrical-sub-station
రాష్ట్రంలోని విద్యుత్‌శాఖ మరోసారి కొలువుల మేళాకు తెరతీసింది. సుమారు మూడువేల ఉద్యోగాల భర్తీకి సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఆ పోస్టులు, అర్హతలకు సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా...


- టీఎస్‌ఎస్‌సీడీసీఎల్‌: సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిస్కంల పరిధిలో సుమారు 11 వందల ఇంజినీరింగ్‌, 2,761 ఓ అండ్‌ ఎం, 288 అకౌంట్స్‌ పోస్టులను అంటే సుమారు 4 వేలకు పైగా పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద భర్తీ చేశాయి. మరోసారి సదరన్‌ పవర్‌ మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేషన్లను విడులద చేసింది.
- మొత్తం పోస్టులు: 2939

పోస్టుల వారీగా ఖాళీలు-అర్హతలు
- పోస్టు: జూనియర్‌ లైన్‌మెన్‌
- ఖాళీల సంఖ్య- 2438
- అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ (ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణతతోపాటు స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి.
- పోస్టు: జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌
- ఖాళీల సంఖ్య: 477
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత.
- పోస్టు: జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌
- ఖాళీల సంఖ్య: 24
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
నోట్‌: పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 10 నుంచి టీఎస్‌ఎస్‌పీసీడీఎల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం అన్నీ అందులో ఉంటాయి. పైన ఇచ్చిన అర్హతలు కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూసుకోవాలి.
- జిల్లాల వారీగా ఖాళీలు, ఎంపిక విధానం తదితర వివరాలు అన్ని అక్టోబర్‌ 10న వెబ్‌సైట్‌లో పూర్తిస్థాయి ప్రకటనను సదరన్‌ పవర్‌ విడుదల చేయనున్నది. సూర్యాపేట జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నందున ఆ జిల్లాలోని పోస్టులను ఈ నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్‌ 10 నుంచి
- వెబ్‌సైట్‌: https://www.tssouthernpower.com

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1936
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles