‘జేఈఈ మెయిన్‌' గడువు పెంపు


Tue,October 1, 2019 10:37 PM

జనవరి 2020లో జరుగనున్న జేఈఈ మెయిన్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఎన్‌టీఏ పొడిగించింది. మొదట ప్రకటంచిన ప్రకారం సెప్టెంబర్‌ 30 చివరితేదీ. కానీ దీన్ని అక్టోబరు 10 (up to 11.50 p.m.) వరకు పొడిగించారు. దీనికి సంబంధించిన ఫీజును అక్టోబర్‌ 11 (up to 11.50 p.m.) గంటల వరకు ఫీజులు చెల్లించవచ్చని ఎన్‌టీఏ వెల్లడించింది. దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకోవడానికి అక్టోబర్‌ 14 నుంచి 20 (up to 11.50 p.m.) వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. 2020, జనవరి 6 నుంచి 11 వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఫలితాలను 2020, జనవరి 31న వెల్లడిస్తారు. పూర్తి వివరాల కోసం
వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in చూడవచ్చు.

270
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles