మే 17న ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్


Tue,September 17, 2019 10:47 PM

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 2020, మే 17న నిర్వహించనున్నారు. ఈసారి పరీక్షను ఐఐటీ-ఢిల్లీ నిర్వహించనున్నది.


-విదేశాల్లోనూ... దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీల్లో ప్రవేశాలకు రాసేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ని వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్షను యూఏఈలోని దుబాయ్, నేపాల్ రాజధాని ఖాట్మాండూ, ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా, శ్రీలంక రాజధాని కొలంబో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, సింగపూర్‌లలో నిర్వహించారు. తొలిసారిగా వచ్చే ఏడాది అమెరికాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles