కొత్త విషయాలను కనుగొనే సామర్థ్యం?


Wed,August 28, 2019 01:21 AM

-సృజనాత్మకత - తరగతిగది అన్వయం
-ఊహకు రూపాన్ని ఇవ్వడమే సృజనాత్మకత.
-కొత్తది సృష్టించడం లేదా ముందే ఉన్న దానికి, ఊహకు రూపాన్ని మార్చడమే సృజనాత్మకత.
teacher

సృజనాత్మకత అంటే?

-నూతన అంశాలు/అసాధారణ అంశాలు/నూతన సంబంధాలను రాబట్టడం.
-సమస్యలకు కొత్త పరిష్కారాలను రాబట్టడం.
-నూతన పద్ధతులు/నూతన యాంత్రిక ఉత్పత్తులను కనుక్కోవడం.
-కళాత్మక వస్తువులను, రూపాలను కనుక్కోవడం.
-ఒక కొత్త ఊహను కానీ, వస్తువును కానీ ఉత్పత్తిచేసే ప్రక్రియే సృజనాత్మకత - జేపీ గిల్‌ఫర్డ్
-ఆలోచనల్లో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తీకరించడమే సృజనాత్మకత - చాప్లిన్
-సంపూర్ణంగా/పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత - స్టాగర్న్, కార్వొస్కి
-సృజనాత్మకతపై విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తి - జేపీ గిల్‌ఫర్డ్
-సృజనాత్మకతకు మూలం అలోచన అని గిల్‌ఫర్డ్ తెలిపారు.
-1950లో సృజనాత్మకతను మనోవిజ్ఞానశాస్త్ర అంశంగా జేపీ గిల్‌ఫర్డ్ ప్రస్తావించారు.

-ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తి సాధారణ మానసిక సామర్థ్యం అయితే సహజసామర్థ్యాలు అనేవి ఒక వ్యక్తి ప్రత్యేక సామర్థ్యం.
-ప్రజ,్ఞ సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత వ్యక్తికి పుట్టుకతోనే వస్తాయి. అయితే ప్రజ్ఞను శిక్షణ, అభ్యాసం, అభ్యసనం ద్వారా మెరుగుపరచలేం.
-సహజ సామర్థ్యాలు ఆ వ్యక్తిలో ఉంటే అతనికి శిక్షణ, అభ్యాసం, అభ్యసనం ద్వారా సహజసామర్థ్యాలను మెరుగుపరచవచ్చు.
-సృజనాత్మకత సామర్థ్యం ఆ వ్యక్తిలో ఉంటే అతనికి శిక్షణ, అభ్యాసం, అభ్యసనం ద్వారా సృజనాత్మకతను మెరుగుపరచవచ్చు.

మూలకాలు

-పోర్టర్ ప్రకారం సృజనాత్మకత ఐదు మూలకాలను కలిగి ఉంటుంది. అవి..
1. ధారాళత: పుంఖాను పుంఖాలుగా ఆలోచనలు రావ డం, తద్వారా ఏదో ఒక నూతన ఆలోచన కలుగడం.
2. నమ్యత: తెలిసిన ఆలోచనలను మార్చుకోవడం లేదా రూపాంతరం చెందించడం.
3. వాస్తవికత: అసాధారణ ఆలోచనలను ఉత్పత్తి చేయడం, తద్వారా కొత్త విషయాన్ని కనుక్కోవడం.
4. అవగాహన: మన చుట్టూ ఉన్న విషయాల మధ్యగల సంబంధాలను గుర్తించి, వాటికి అతీతంగా ఆలోచించడం.
5. ప్రేరణ: నూతన ఆలోచనలను ప్రేరేపించే అంతర్గత సామర్థ్యం.

లక్షణాలు (Features of Creativity)

-సృజనాత్మకత ఒక ఆలోచన.
-సృజనాత్మకత ఒక విధానమేగానీ ఉత్పత్తి కాదు.
-చేతనలో ఆలోచనలు ఇమిడి ఉంటాయి.
-సృజనాత్మకతను వ్యక్తిగతంగా/సామూహికంగా ఉద్దీపింపచేయవచ్చు. క్రమబద్ధం కావచ్చు లేదా కాకపోవచ్చు.
-మార్పునకు దోహదపడే నూతన ఆలోచనా సరళి.
-ఒకసారి జరిగి ఆగిపోయే ప్రక్రియ కాదు, ఒక నిరంతర ప్రక్రియ.
-సృజనాత్మకతకు ఉన్నతస్థాయి ఆలోచన అవసరం.
-లక్షణాలు అనువంశికంగా రానవసరం లేదు.
-ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత స్థాయిలో ఉంటాయి.
-ప్రతిభావంతులు సృజనాత్మకతను కలిగి ఉండనవసరం లేదు. కానీ సృజనాత్మకత కలిగి ఉన్నవారు ప్రతిభావంతులు కావచ్చు.

సృజనాత్మకత స్థాయిలు (Levels of Creativity):

-సృజనాత్మకత ఐదు స్థాయిల్లో ఉంటుంది. అవి..
-వ్యక్తీకరణ స్థాయి (Expressive Level): సృజనాత్మక ఆలోచనలను వ్యక్తీకరించే సామర్థ్యం.
-ఉత్పత్తి స్థాయి (Production Level): సృజనాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే సామర్థ్యం.
-పరిశోధనా స్థాయి (Research Level): ప్రస్తుతం ఉన్న విషయాల్లోని లోపాలను కనుగొని తగిన మార్పులు చేయగల సామర్థ్యం.
-నూతన సృజనస్థాయి (Innovative Level): కొత్త విషయాలను కనుగొనే సామర్థ్యం.
ఆవిష్కరణ స్థాయి: ఇంతవరకు ఎవరూ కనుగొనని విషయాలను/వస్తువులను కనిపెట్టగలిగే సామర్థ్యం
-బోడెన్ ప్రకారం నూతన ఆలోచనలను ఉత్పత్తిచేసే సృజనాత్మకత మూడు రకాలు. అవి..
-సంయోగత సృజనాత్మకత: తెలిసిన ఆలోచనలను ఒకచోట చేర్చడం.
-అన్వేషణాత్మక సృజనాత్మకత: నూతన ఆలోచనలను ఉత్పత్తిచేసే సామర్థ్యం.
-రూపాంతర సృజనాత్మకత: ప్రస్తుత విషయాలను ఉపయోగించి నూతన విషయాలను సృజించడం.

సృజనాత్మక ప్రక్రియలో దశలు

-వల్లాస్: సృజనాత్మకత ప్రక్రియ గురించి రచించిన పుస్తకాన్ని (Art of Thought) రిచర్డ్ స్మిత్ ప్రచురించారు. ఆయన సృజనాత్మకత ప్రక్రియ 5 దశలలో జరుగుతుందని తెలిపారు. అవి..

1. సన్నాహక దశ (Preparation Stage)
-మనస్సును సమస్యపై కేంద్రీకరించి అన్ని కోణాల నుంచి అన్వేషించి సమస్య పరిష్కారానికి ప్రాథమిక పనిలో నిమగ్నమవడం.
-ఒక ప్రణాళిక వేసుకుని తదనుగుణంగా నడుచుకోవడం/ఆచరించడం.
-ఈ దశలో వ్యక్తిలో అంతర్గత ప్రేరణ పెంపొందుతుంది.
-కొన్ని భావనలు ఉత్పన్నమవుతాయి. కాని అవి పరిష్కారానికి దారి తీయవు.

2. భావోత్పత్తి( Incubation Stage)
-సమస్యను గురించిన ఎటువంటి ఆనవాళ్లు బయటకు తెలియకుండా అచేతనంలోకి అంతర్లీనం చేసుకొని బాహ్యంగా చూస్తే ఏమీ జరుగుతున్నట్లుగా కనబర్చకపోవడం.
-ఇలా చేయడం వల్ల పరిష్కారాన్ని అడ్డుకుంటున్న ఇతర కారకాలను క్షీణింపచేయవచ్చు.

3. సమాచారం/ సంకేతం( Information Stage)
-ఈ దశలో వ్యక్తికి పరిష్కారం దగ్గరగా ఉన్నట్లు భావన కలుగుతుంది.
-ఇతర అడ్డంకుల ప్రభావం తగ్గుతున్నందువల్ల వ్యక్తిలో సమస్యా పరిష్కార భావన తలెత్తుతుంది.

4. ప్రకాశం/ అంతర్‌దృష్టి( Illumination stage)
-వ్యక్తిలో సృజనాత్మక భావన/ పరిష్కరణ అచేతనం నుంచి చేతనంలోకి అకస్మాత్తుగా వస్తుంది.
-నేను కనుక్కున్నాను,Yes I got it అనే ఉత్సాహంతో, ఉద్వేగంతో నూతన పరిష్కార మార్గం కనుక్కుంటాడు.

5. నిరూపణం ( Verification Stage)
-ఈ దశలో వ్యక్తి స్పందించి, ఫలితాన్ని నిజ సన్నివేశాలకు అనుప్రయుక్తం చేసి ఫలితాలను నిరూపిస్తాడు.
-తర్వాత ఈ ఫలితాలను సార్వత్రిక అనుప్రయుక్తానికి నివేదిస్తాడు. (ఈ దశల్లో ప్రతీ సృజనాత్మక చర్యలో అన్ని దశల గుండా తప్పక వెళ్లాలనే కచ్చితమైన నియమం లేదు)

సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు

-బ్రెయిన్ స్టార్మింగ్ పద్ధతులకు అవకాశం కల్పించాలి.
-స్వయం చొరవకు అవకాశం కల్పించాలి.
-అసాధారణ ప్రశ్నలకు అవకాశం కల్పించాలి.
-బోధనా యంత్రాలను ఉపయోగించాలి.
-బ్రూనర్ కాన్సెప్ట్ అటెయిన్‌మెంట్ మోడల్ భావనలను ఉపయోగించాలి.
-సచ్‌మెన్ ఎంక్వయిరీ ట్రైనింగ్ మోడల్ శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించాలి.
-పిల్లలు ఆటలు ఎక్కువ ఆడేటట్లు చేయాలి.

ఉపాధ్యాయుడు, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే చర్యలు

-తరగతి గది వాతావరణం, ఉపాధ్యాయుల ప్రవర్తన సృజనాత్మకతను పెంపొందిస్తాయి.
-విద్యార్థులలో ప్రేరణ స్థాయిని పెంచడం
-ఆసక్తి చూపుతున్న రంగాల్లో ప్రతిభను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకొవడం.
-ప్రోత్సాహకాలు, బహుమతులు, అభినందనలు తెలపడం.
-విద్యార్థులు తయారుచేసిన వాటిని ప్రదర్శించుట, అభినందించడం.
-బోధనాభ్యసన ప్రక్రియను విద్యార్థుల అంతర్గత శక్తులను వెలికితీసే విధంగా చేయడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొదించవచ్చు.

సృజనాత్మకత ప్రతిబంధకాలు

-వివిధ రకాల అంశాలు/ కారకాలు సృజనాత్మకతకు ప్రతిబంధకాలు కావచ్చు. అవి..
1. నియంతృత్వ, ఛాందసవాద పోకడలు, సమకాలీన దేశమాన పరిస్థితులు
2.వ్యక్తిగత ఆలోచనా సరళి, వైఖరులు, ఆసక్తులు
3. సమస్యలకు విభిన్న ప్రత్యామ్నాయ మార్గాలను కనుక్కోకపోవడం.

సృజనాత్మకత పరీక్షలు

1. వల్లాస్ సృజనాత్మకత పరీక్షలు
2. టోరెన్స్ సృజనాత్మకత ఆలోచనా పరీక్షలు
3. రిమోట్ అసోసియేషన్ టెస్ట్
4. మిన్నిసోటా పరీక్షలు (అశాబ్ధిక పరీక్షలను ఉపయోగిస్తారు)
- చిత్రనిర్మాణం
- సృజనాత్మక నమూనా రూపొందించడం
- వృత్తాల ఆధారంగా బొమ్మలు గీయడం
- చతురస్రాలను నూతన ఆకారాలుగా గీయడం
5. గెట్ జెల్స్, జాక్‌సన్‌ల 5 రకాల పరీక్షలు
- పద సంసర్గ పరీక్ష
- వస్తువుల ఉపయోగ పరీక్ష
- అదృశ్య ఆకారాల పరీక్ష
- మూడు వివిధ ముగింపులు
- సమస్యలను రూపొందించడం

క్లాస్‌రూమ్ అప్లికేషన్ బిట్స్

1. తరగతి గదిలో సృజనాత్మకతను పెంపొందించే ఉపాధ్యాయుడిగా కింది వాటిలో మీ దృష్టిలో సృజనాత్మకత కాని అంశం ఏది?
1) నేనే ఈ బొమ్మ వేశాను అని లక్ష్మి చెప్పడం
2) నేనే కవితను రాశానని ఈశ్వర్ అనే విద్యార్థి చెప్పడం
3) నేనే ఈ పదాన్ని నేర్చుకున్నానని భవాని అనే విద్యార్థిని చెప్పడం
4) ఉపాధ్యాయుడిచ్చిన సమస్యలు రవి అనే విద్యార్థి సాధించడం

2. మీ దృష్టిలో సృజనాత్మకతకు దోహదపడనిది?
1) ఇంకుబేషన్
2) కాపీయింగ్
3) బ్రెయిన్ స్టార్మింగ్
4) డైవర్జంట్ థింకింగ్

3. కింది వాటిలో సృజనాత్మకత గల టీచర్ ఎవరు?
1) బోధనా పద్దతులన్నీ పాటించే టీచర్
2) చక్కని బోధనా ప్రణాళికతో పాఠం చెప్పే టీచర్
3) భిన్న పద్ధతుల్లో అర్థమయ్యేలా చెప్పే టీచర్
4) ఇతరుల కంటే విభిన్న పద్ధతిలో చెప్పే టీచర్

4. ఉపాధ్యాయుడిలో ఉండే సృజనాత్మకత ఊహను గుర్తించండి?
1) చెట్లకు కాయలు బాగా కాస్తే
2) చెట్లకు ప్రాణముంటే
3) చెట్లకు మాటలు వస్తే
4) చెట్లను నరికివేయకుండా ఉంటే
Shivapalli

1147
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles