కాలీఫ్లవర్‌లో ముడుతలు పడటానికి కారణం?


Wed,August 28, 2019 01:20 AM

-గతవారం తరువాయి
SeaSquirtsDidemnummolle

మెగ్నీషియం (Mg)

-ఇది వృక్షాల్లో క్లోరోఫిల్ (పత్రహరితం) నిర్మాణానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన మూలకం.
-ఇది రైబోసోమ్‌లోని రెండు ఉపప్రమాణాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది.
-ఇది హృదయ స్పందన స్థిరంగా ఉండేందుకు, రక్తపీడనం సాధారణంగా ఉండేందుకు, అంతేకాకుండా ఎముకల గట్టితనానికి తోడ్పడుతుంది.

లోపంవల్ల వచ్చే సమస్య

-దీని లోపంవల్ల వృక్షాలు వాటి పత్రాలు ఆకుపచ్చ రంగుని కోల్పోతాయి. అంతేకాకుండా పత్రాల ఉపాంతం వంపు తిరుగుతుంది.

సల్ఫర్ (S)

-ఇది సిస్టిన్, సిైస్టెన్, మిథియోనిన్ అనే అమైనో ఆమ్లాల తయారీలో, ప్రొటీన్ల తయారీలో అవసరమవుతుంది.
-అంతేకాకుండా B1, B7 విటమిన్ల తయారీలో తోడ్పడుతుంది.
-ఇది హెపారిన్, ఇన్సులిన్, పూర్వపియూష హార్మోన్లు, థయామిన్, లైపోయిక్ ఆమ్లం, బయోటిన్, కో ఎంజైమ్-A మొదలైనవాటిలో ప్రధానాంశంగా ఉంటుంది.

లోపంవల్ల వచ్చే సమస్య

-లెగ్యుమినేసి మొక్కల్లో వేరుబుడిపెలు ఏర్పడవు.
-టీ మొక్కల్లో పత్రాలు ఏర్పడవు.

ఐరన్/ఇనుము (Fe)

-ఇది కిరణజన్య సంయోగక్రియలో తోడ్పడే ఫెర్రిడాక్సిన్, సైటోక్రోమ్, సైటోక్రోమ్ ఆక్సిడేస్‌ల సంశ్లేషణలో తోడ్పడుతుంది.
-ఇది సూక్ష్మ మూలకమైనప్పటికీ కొంచెం ఎక్కువ మోతాదు లో అవసరమవుతుంది. కాబట్టి దీన్ని సూక్ష్మ పోషకాల్లో స్థూల పోషకం అంటారు.
-ఇది శ్వాస వర్ణకం అయిన హిమోగ్లోబిన్ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషిస్తుంది (Hb ఏర్పాటుకు 1 ఫెర్రస్ అణువు అవసరం)
-ఐరన్ ప్లీహంలో, పేగు గోడల్లో ఫెరిటిన్ (Feritin) అనే సంయోగ పదార్థం నిల్వ ఉంటుంది.

లోపంతో వచ్చే సమస్యలు

-ఎనీమియా (పాండురోగం) వ్యాధి వస్తుంది.
-పెర్నీషియస్ ఎనీమియా వ్యాధి వస్తుంది.
-మొక్కల్లో పెరుగుదల తగ్గడం.

అయోడిన్ (I)

-ఇది ఎక్కువగా సముద్ర రొయ్యల్లో లభిస్తుంది.
-దీనిపై భారత ప్రభుత్వం మొదటగా శాసనం చేసింది.
-ఈ మూలకం అవటుగ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అవసరమవుతుంది.
-థైరాక్సిన్ హార్మోన్ దేహంలో ఆధార జీవక్రియ రేటును (BMR) క్రమపరుస్తుంది.

లోపం వల్ల వచ్చే సమస్యలు

-గాయిటర్: అయోడిన్ లోపంతో థైరాయిడ్ గ్రంథి వాస్తుంది.

కాపర్ (Cu)

-క్రస్టేషియా, మొలస్కా వంటి అకశేరుకాల్లో ఉన్న హీమోసయనిన్ అనే శ్వాసవర్ణకంలో కాపర్ ముఖ్యమైన మూలకం.
-ఇది ప్లాస్టోసయనిన్, సైటోక్రోమ్, విటమిన్-సీ తయారీలో తోడ్పడుతుంది.

లోపం వల్ల వచ్చే సమస్య

-డైబ్యాక్ వ్యాధి: ఇది కలప మొక్కల్లో వస్తుంది.

జింక్ (Zn)

-ఇది జీవుల పెరుగుదలకు, కణవిభజనకు, ప్రత్యుత్పత్తికి, దీర్గాయువుకు చాలా అవసరం.
-ఇది క్లోమంలోని బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమపరుస్తుంది.
-ట్రిఫ్టోఫాన్ అనే అమైనోఆమ్ల ఉత్పత్తికి అవసరమవుతుంది.

లోపంతో వచ్చే సమస్య

-మొక్కల్లో దీని లోపం వల్ల ఆకులు చిన్నవిగా ఉంటాయి.

మాంగనీస్ (Mn)

-ఇది అకశేరుకాల్లోని పిన్నాగ్లోబిన్ అనే శ్వాస వర్ణకంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
-కిరణజన్య సంయోగక్రియలోని కాంతి దశలో నీటి కాంతి విశ్లేషణ జరిగి ఆక్సిజన్ విడుదలకు అవసరమవుతుంది.

లోపంతో వచ్చే సమస్య

-మొక్కల్లో వంధ్యమైన పుష్పాలు ఏర్పడుతాయి.

మాలిబ్డినమ్ (Mo)

-ఇది సల్ఫర్, నైట్రోజన్ జీవక్రియల్లో తోడ్పడుతుంది.
-ఇది నత్రజని స్థాపనలో తోడ్పడే నైట్రోజినెస్ అనే ఎంజైమ్ తయారీలో అవసరమవుతుంది.

బోరాన్ (B)

-ఇది మొక్కల్లో పోషక కణజాలం ద్వారా పోషక పదార్థాల రవాణాలో, వేరు బుడిపెల ఏర్పాటులో తోడ్పడుతుంది.
-కణవిభజనలో ఉపయోగపడుతుంది.
-దీని లోపంవల్ల కాలీఫ్లవర్‌లో ముడుతలు పడుతాయి.

వెనేడియం (Ve)

-ఇది యూరోకార్డేటా జీవుల శ్వాస వర్ణకం అయిన వెనేడియంలో ముఖ్య అంశీభూతం.

పిండిపదార్థాలు (Carbohydrates)

-కర్బన పరమాణువులను కలిగిన పాలీహైడ్రాక్సీ ఆల్డీహైడ్ లేదా కీటోన్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న పదార్థాలను పిండిపదార్థాలు ( కార్బోహైడ్రేట్స్) అంటారు.
-ఇవి కార్బన్ (C), హైడ్రోజన్ (H ), ఆక్సిజన్ (O) మూలకాలను కలిగి ఉన్న పదార్థాలు. వీటిలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌ల నిష్పత్తి 1:2:1 గా ఉంటుంది. Cn (H2O)n అనేది వీటి సాధారణ ఫార్ములా.
-కార్బోహైడ్రేట్‌లను కార్బన్ హైడ్రేట్‌లు (Hydrates of Carbon ) అంటారు.
-మొక్కలలో పిండిపదార్థాలు కిరణజన్యసంయోగ క్రియ ద్వారా తయారు అవుతాయి.
-వీటిని శాఖరైడ్‌లు (Saccharides), చక్కెరలు( Sugers) అంటారు.
-వీటిని శక్తివనరులు (Energy Resources), శక్తిజనకాలు, శక్తి ఉత్పాదకాలు అంటారు.
-ఒక రోజుకు కావలసిన కార్బోహైడ్రేట్ పరిమాణం- 500 గ్రాములు
-1గ్రాము కార్బోహైడ్రేట్ నుంచి 4k.cal/4000 cal శక్తి లభిస్తుంది.
-బంగాళదుంప, వరి, గోధుమ, అరటిలో ఎక్కువగా కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.
-కార్బోహైడ్రేట్‌లను గుర్తించే పరీక్ష- అయోడిన్ పరీక్ష. ఈ పరీక్షలో కార్బోహైడ్రేట్‌లు నీలిరంగులోకి మారుతాయి.
-కార్బోహైడ్రేట్‌లు జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ ఏర్పడుతుంది.
-కార్బొహైడ్రేట్‌లను జీర్ణం చేసే ఎంజైమ్‌లు- కార్బొహైడ్రేజ్‌లు/ఎమైజ్‌లు
-బియ్యంలో కార్బొహైడ్రేట్‌ల శాతాన్ని గుర్తించే సూచిక- ైగ్లెసిమిక్స్ సూచిక(GI )
-చక్కెరలను/ చక్కెర ద్రవాల గాఢతలను కొలిచే పరికరం- సకారిమీటర్(Sacchari meter)
-ధృవ ప్రాంతంలోని దేశాల్లో చక్కెరలను Beetroot, Potato నుంచి తయారు చేస్తారు.

కార్బోహైడ్రేట్ వర్గీకరణ

-కార్బోహైడ్రేట్‌లను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి మోనోశాఖరైడ్‌లు డైశాఖరైడ్‌లు ఆలిగోశాఖరైడ్‌లు పాలీశాఖరైడ్‌లు మోనోశాఖరైడ్‌లు
-ఇవి ఒకే చక్కెర/శాఖరైడ్ ప్రమాణంతో ఏర్పడుతాయి. వీటినే మోనోశాఖరైడ్‌లు అంటారు.
-ఇవి చిన్న శాఖరైడ్ ప్రమాణాలు
-ఇవి జలవిశ్లేషణం చెంది ఇతర చిన్న ప్రమాణాలను ఏర్పరచవు.
-ఇవి సులభంగా నీటిలో కరిగి శక్తిని ఇస్తాయి.
ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, మానోజ్, రైబోజ్, డీఆక్సీరైబోజ్

-గ్లూకోజ్ (C6H12O6): దీన్ని Universal Sugar, Grape Sugar, Corn Sugar, Blood Sugar, Dextrose Sugar అంటారు.
-దీనిలో ఆరు కార్బన్లు ఉంటాయి. అందువల్ల దీన్ని హైక్సోజ్ చక్కెర అంటారు.
-దీనిలో ఆల్డీహైడ్ ప్రయేయ సమూహం ఉంటుంది.
-దీనిలో కార్బన్‌లు, ఆల్డీహైడ్ గ్రూప్ ఉండటంతో దీన్ని ఆల్డోహెక్సోజ్ అంటారు.
-ఇది ఇతర పదార్థాలను క్షయకరణం చెందిస్తుంది. అందువ్ల దీన్ని క్షయకరణ చక్కెర (Reducing Sugar) అంటారు.
-ఇది మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది.
-ఇది క్రీడాకారులకు తక్షణ శక్తి ఇస్తుంది.

ఫ్రక్టోజ్ (C6H12O6)

-దీన్ని Fruit Sugar, Honey Sugar, Levulose Sugar అంటారు.
-ఇది సహజంగా దొరికే అతి తియ్యని చక్కెర.
-దీనిలో 6 కార్బన్లు ఉంటాయి. అందువల్ల దీన్ని హెక్సోజ్ చక్కెర అంటారు.
-దీనిలో కీటోన్ ప్రమేయ సమూహం ఉంటుంది.
-దీనిలో 6 కార్బన్లు కీటోన్ గ్రూపు ఉండటం వల్ల దీన్ని కీటోహెక్సోజ్ అంటారు.
SeaSquirtsDidemnummolle1

ఫ్లోరిన్ (F)

-ఇది నీటిద్వారా, సముద్ర ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది.
-దంతాలపై ఉండే గట్టి ఎనామిల్ ఉత్పత్తికి అవసరం, హృదయాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

లోపంతో వచ్చే సమస్య

-ఫ్లోరోసిస్: నీటిలో ఫ్లోరిన్ స్థాయి దాటితే దంతాలు పసుపురంగులోకి మారి ఎనామిల్ విచ్ఛిత్తి చెంది, ఎముకలు పెలుసుబారుతాయి.
-నీటిలో ఫ్లోరిన్‌ను తగ్గించడాన్ని డీఫ్లోరినేషన్ అంటారు.
-NEERI- నాగపూర్ సంస్థ నీటిలోఉన్న ఫ్లోరిన్‌ను తటస్థ పరచడానికి సున్నం, పట్టిక, బ్లీచింగ్ పౌడర్‌లను కలపాలని తెలిపారు. ఈ ప్రక్రియనే నల్లగొండ విధానం అంటారు.

కోబాల్ట్ (Co)

-ఇది B12-విటమిన్‌లో ప్రధానాంశం.
-కోబాల్ట్ B12- విటమిన్‌ను సంశ్లేషణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

లోపం వల్ల వచ్చే సమస్యలు

-నెమరువేసే జంతువుల్లో ఆకలి మందగించి దేహం క్షీణిస్తుంది.
-రక్తంలో హీమోగ్లోబిన్ మోతాదు తగ్గిపోతుంది.

అధికంగా ఉంటే వచ్చే సమస్య

-కోబాల్ట్ అధికమైన ఆహారం విషతుల్యం అవుతుంది.
Mallesh

1176
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles