ఎల్‌ఐసీలో 300 ఖాళీలు


Fri,August 9, 2019 01:14 AM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ( హెచ్‌ఎఫ్‌ఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
lic-housing
-మొత్తం పోస్టులు: 300 (అసిస్టెంట్-125, అసోసియేట్-75, అసిస్టెంట్ మేనేజర్-100)
-ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇండియాలో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. అసిస్టెంట్/అసోసియేట్ పోస్టులను రాష్ర్టాలవారీగా, మేనేజర్ పోస్టులను దేశవ్యాప్తంగా భర్తీచేస్తారు.
-అర్హత: అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, అసోసియేట్ పోస్టులకు సీఏ ఇంటర్‌తోపాటు బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అసిస్టెంట్ మేనేజర్‌లకు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతోపాటు ఎంబీఏ/ఎంఎంఎస్ లేదా పీజీడీబీఏ/పీజీడీబీఎం, పీజీపీఎం/పీజీడీఎంలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
-వయస్సు: 2019 జనవరి 1 నాటికి 21 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: ప్రదేశాన్ని బట్టి సుమారుగా అసిస్టెంట్‌కు రూ. 23,870/- అసోసియేట్‌కు రూ. 35,960/-, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ. 56,000/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌తోపాటు దేశవ్యాప్తంగా 50 కేంద్రాల్లో
-ప్రొబేషనరీ పీరియడ్: మేనేజర్‌కు ఏడాది. మిగతా పోస్టులకు 6 నెలలు
-ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ
-రాతపరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నాలుగు విభాగాలలో మొత్తం 4X50=200 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 200.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26
-హాల్ టికెట్ల డౌన్‌లోడింగ్: సెప్టెంబర్ 9 నుంచి
-ఆన్‌లైన్ ఎగ్జామ్‌తేదీ: అక్టోబర్ 9,10
-వెబ్‌సైట్: www.lichousing.com

826
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles