కొత్త ఐటీ కోర్సులు జాతీయసంస్థల్లో...


Wed,August 7, 2019 02:02 AM

businesswoman
నాగరాజు పదేండ్లకు పైగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నాడు. కానీ కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక సాంకేతికతతో తాను దశాబ్దం కింద నేర్చుకున్న కోర్సు ఆవుట్‌డేటెడ్ అయిపోతున్నది. కెరీర్‌కు పెద్ద గండం ఏర్పడింది. రానురాను చాలా కంపెనీలు పాత టెక్నాలజీలను పక్కన బెట్టి కొత్త సాంకేతికను స్వాగతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది కొత్త కొర్సులను నేర్చుకుని కెరీర్‌లో ముందుకుపోవాలనే కాంక్షతో ఉన్నారు. కానీ వారికి ప్రైవేట్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నవాటిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేక, వాటికి పెద్దగా వ్యాలిడిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలు కొన్ని సరికొత్త కోర్సులను అంటే ఏఐ, ఎంఎల్, డాటాసైన్స్ వంటివాటిని అందిస్తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి ఆన్‌లైన్‌లో కొత్త టెక్నాలజీలో శిక్షణవ్వడమే కాకుండా ఈ సంస్థలు ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్‌ను కూడా ఇస్నున్నాయి. ఆయా కోర్సులను రాష్ట్రంలో అందిస్తున్న సంస్థల వివరాలు...

- ఐఐటీ హైదరాబాద్: ఇక్కడ సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్ 2015 నుంచి ఇండస్ట్రిలో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌కు ఎంటెక్ ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేస్తుంది. వీడియో ఎనేబుల్డ్ ఆన్‌లైన్ కోర్సు (అప్పుడప్పుడు వారాంతాల్లో క్యాంపస్ విజిట్)తో డాటా సైన్స్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇటీవల ఏఐ/ఎంఎల్ కోర్సులను అందిస్తుంది. పూర్తి వివరాలు ఐఐటీ హైదరాబాద్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు లేదా సంప్రదింవచ్చు.
- ఐఐఐటీ హైదరాబాద్: దేశంలోని ఐఐఐటీల్లో కంప్యూటర్ రంగంలో టాప్‌లో ఉన్న జాతీయస్థాయి విద్యాసంస్థ ఇది. ఇక్కడ కేవలం ఎంట్రెన్సులలో అర్హత సాధించినవారికే కాకుండా ఇండస్ట్రీ అవసరాల మేరకు ఆయా కోర్సులను ఇతర సంస్థల భాగస్వామ్యంతో అందిస్తుంది. వాటిలో ఏఐ/ఎంఎల్ ప్రోగ్రామ్ ఒకటి.
businesswoman1
- కోర్సు వివరాలు: ఐఐఐటీహెచ్, టాలెంట్ స్ప్రింట్ కలసి ఈ కోర్సును అందిస్తున్నాయి.
- ఎవరికి ఈ కోర్సు: ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న టెక్నికల్ ప్రొఫెషనల్స్ (హైదరబాద్, దగ్గర్లో ఉన్నవారికి)
- కోర్సు కాలపరిమితి: 60 సెషన్స్-120 గంటలు.
- కోర్సు పూర్తయిన తర్వాత అడ్వాన్స్‌డ్ సర్టిఫికెషన్ ఇన్ ఏఐ/ఎంఎల్‌ను ఐఐఐటీ-హెచ్ ఎంఎల్ ల్యాబ్ ఇస్తుంది. దీంతోపాటు ఎగ్జిక్యూటివ్ అలూమినిలో స్థానం కల్పిస్తారు.
- ఎన్‌ఐటీ వరంగల్: ఎన్‌ఐటిలోని ఈ అండ్ ఐసీటీ అకాడమీ, ఎడురేకా భాగస్వామ్యంతో పోస్ట్-గ్రాడ్యుయేషన్‌లో మెషిన్ లెర్నింగ్/ ఏఐలో కొత్త ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
- ఎవరి కోసం: AI & ML బిగినర్స్ కెరీర్‌ను కిక్‌స్టార్ట్ చేయాలని చూస్తున్నవారికి, AI & MLపై ఆసక్తి ఉన్న ,ప్రాథమిక ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉన్న ఎవరైనా, డేటా సైంటిస్టులు వారి కెరీర్‌లో పెద్ద బూస్టింగ్‌ను కావాలనుకునేవారు, AI & MLలో కెరీర్ పరివర్తన కోసం చూస్తున్న ప్రొఫెషనల్స్‌కు ఈ కోర్సు ఉపయోగపడుతుంది.
- ఎవరు బోధిస్తారు: ఎన్‌ఐటి వరంగల్ అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు ప్రత్యక్ష ఆన్‌లైన్ తరగతుల ద్వారా 450 గంటల బోధన చేస్తారు. దీనిలో 12 అసైన్‌మెంట్స్, ప్రాజెక్టులు ఉంటాయి.
- పూర్తి వివరాల కోసం https://www.nitw.ac.in/eict/edureka.php చూడవచ్చు.

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

585
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles