ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ


Fri,July 12, 2019 01:27 AM

NCC
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 2020 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం (47వ కోర్సు)లో చేరటానికి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


- ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (47వ కోర్సు)
- మొత్తం ఖాళీలు -55 (ఎన్‌సీసీ మెన్ - 50, ఎన్‌సీసీ ఉమెన్ - 5)
- అర్హతలు: ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ హోల్డర్స్: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీలో సీనియర్ డివిజన్‌లో కనీసం రెండు అకడమిక్ ఇయర్స్ సర్వీస్‌తోపాటు ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో కనీసం బీ లేదా సీ సర్టిఫికెట్స్‌ను పొంది ఉండాలి.
- నాన్ ఎన్‌సీసీ హోల్డర్స్: యుద్ధ క్షతగాత్రులు, మరణించినవారు, మిస్సింగ్ అయిన వారి కుటుంబాలకు చెందినవారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వీరికి ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అవసరం లేదు.
- వయస్సు: 2020 జనవరి 1 నాటికి 19 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. 1995, జనవరి 2 - 2001, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
- పేస్కేల్: రూ. 56,100-1,77,500+నెలకు ఎంఎస్‌పీ రూ. 15,500/- చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా
- ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపికైన వారిని రెండు దశల్లో పరీక్షించి ఎంపిక చేస్తారు.
- చెన్నైలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీలో ఉద్యోగావకాశం కల్పిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 8
- వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

772
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles