1. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
1) తల్లివేరు – సమాంతర ఈనెల వ్యాపనం
2) తల్లివేరు – జలాకార ఈనెల వ్యాపనం
3) పీచువేర్లు – జలాకార ఈనెల వ్యాపనం
4) పీచువేర్లు – ద్విదళ బీజాలు
2. స్వల్ప రాత్రికాల పంటకు ఉదాహరణ?
1) జొన్న 2) పత్తి
3) సోయా చిక్కుడు 4) గోధుమ
3. జతపరచండి.
ఎ. తేనెటీగలు 1. అక్వాకల్చర్
బి. పట్టుపురుగులు 2. ఎపీ కల్చర్
సి. చేపలు 3. సెరీ కల్చర్
1) ఎ-3, బి-1, సి-2
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-2, బి-3, సి-1
4) ఎ-1, బి-2, సి-3
4. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. పాలలోని నీటి శాతం 10 – 20 శాతం
బి. జున్నుపాలు పసుపు రంగులో ఉండటానికి కారణం లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
5. కింది వాటిలో శైవలానికి ఉదాహరణ?
ఎ. కుక్కగొడుగు బి. క్లామిడోమోనాస్
సి. సైకస్ డి. చిక్కుడు
1) బి 2) ఎ, బి
3) సి 4) సి, డి
6. ద్విదళ బీజ మొక్కల లక్షణం?
ఎ. తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది
బి. జాలాకాల ఈనెల వ్యాపనం ఉంటుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
7. కింది వాటిలో గుల్మము రకం?
ఎ. గన్నేరు బి. గులాబీ
సి. మిరప డి. ఆవ
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి 4) బి, డి
8. కింది వాటిలో ద్వివార్షిక మొక్క?
1) గోధుమ 2) బెండ
3) క్యారెట్ 4) వరి
9. కింది వాటిలో చలికాలంలో పూచే పూలు?
1) చామంతి 2) కనకాంబరాలు
3) మల్లెలు 4) పైవన్నీ
10. వెల్లుల్లి మొక్కలో జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే భాగం?
1) ఆకులు 2) పాయుగర్భం
3) గింజలు 4) బెరడు
11. గుబురు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు ?
ఎ. వరి బి. చిక్కుడు
సి. వేప డి. మొక్కజొన్న
1) బి 2) బి, సి
3) ఎ, డి 4) పైవన్నీ
12. వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరిపేది?
ఎ. కరివేపాకు బి. రణపాల
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
13. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. నిష్కాంతి దశలో CO2 క్షయకరణం చెంది గ్లూకోజ్ ఏర్పడుతుంది
బి. కిరణజన్య సంయోగక్రియ ఒక కాంతి రసాయన చర్య
సి. కిరణజన్య సంయోగ క్రియలో H2O విచ్ఛిత్తి చెంది వాతావరణంలోకి CO2 విడుదల చేయబడుతుంది
1) బి 2) ఎ, బి
3) ఎ, సి 4) పైవన్నీ
14. లైంగిక ప్రత్యుత్పత్తిలో అనావశ్యక భాగం?
1) రక్షక పత్రావళి 2) కేసరావళి
3) అండకోశం 4) పైవన్నీ
15. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. మొక్కల్లో ద్విఫలదీకరణ, త్రిసంయోగం జరుగుతుంది
బి. శీతాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు
1) బి 2) ఎ
3) ఎ, బి 4) ఏదీకాదు
16. మొక్కల్లో కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే పోషక పదార్థం?
1) పొటాషియం 2) పాస్ఫరస్
3) నత్రజని 4) పైవన్నీ
17. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. కృత్రిమంగా గుడ్లను పొదిగించే ఇంక్యుబేటర్స్
బి. తేనెటీగల్లో మన ఈగలను డ్రోనులు అంటారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
18. గుర్రానికి ఏర్పడే శ్వాశత దంతాల సంఖ్య?
1) 32 2) 26
3) 42 4) 28
19. పశువుల్లో గొంతువాపు వ్యాధికి నివారణ?
1) ట్రైక్విన్ ఇంజక్షన్ 2) బెర్నిల్ ఇంజక్షన్
3) హెచ్-ఎస్ టీకా 4) పైవన్నీ
20. తేనెటీగల్లో మకరందాన్ని, పరాగరేణువులను సేకరించేవి?
1) రాణి ఈగ 2) డ్రోనులు
3) కూలీ ఈగలు 4) ఏదీకాదు
21. రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండే వేర్లను కలిగిన మొక్క?
1) కరివేపాకు 2) చిక్కుడు
3) మర్రి 4) మామిడి
22. దీనిలోని షెడ్యూలు-1 ప్రకారం అడవి జంతువులను వేటాడటం, విక్రయించడం నేరం?
1) వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1971
2) వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1991
3) వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1981
4) వన్యప్రాణి పరిరక్షణ చట్టం 1961
1. క్యాన్సర్‌ను నివారించే ఆహార పదార్థాలు ?
1) కెరోటి నాయిడ్లు
2) యాంటీ ఆక్సిడెంట్స్
3) లైకోపీన్స్ 4) లిపిడ్స్
2. ఇంగువ మొక్కలోని ఏ భాగం?
1) కాయ 2) విత్తనం
3) స్రావం 4) బెరడు
3. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి
3) విటమిన్-డి 4) విటమిన్-సి
4. టమాటలో అధికంగా ఉండే విటమిన్?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి
3) విటమిన్-సి 4) విటమిన్-డి
5. రక్త శుద్ధికి తోడ్పడే ఆహార పదార్థం?
1) బంగాళదుంప 2) చిలగడదుంప
3) చేమదుంప 4) క్యారెట్
6. డ్రైఫ్రూట్స్ ఖరీదుగా ఉండటానికి కారణం?
1) కొన్ని ప్రాంతాల్లో మాత్రమే
పెరుగుతాయి
2) ఎక్కువ పరిమాణంలో లభించవు
3) రవాణా ఖర్చు అధికం
4) పైవన్నీ
7. చికోరి ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది?
1) జీర్ణ వ్యవస్థ 2) రక్త ప్రసరణ వ్యవస్థ
3) 1, 2 4) విసర్జక వ్యవస్థ
8. ఖాళీ కడుపుతో అరటి పండును తింటే?
1) రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది
2) రక్తంలో చక్కెరస్థాయి తగ్గుతుంది
3) రక్త ప్రసరణ పెరుగుతుంది
4) రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది
9. మెంతులు మొక్కలోని ఏ భాగం?
1) వేరు 2) కాయలు
3) గింజలు 4) ఆకులు
10. అరటిపండులోని చక్కెర ప్రభావం తగ్గించడానికి ఆహారంలో ఏ పదార్థాలు
తీసుకోవాలి?
1) పిండి పదార్థాలు 2) మాంసకృత్తులు
3) గ్లూకోజ్ 4) కొవ్వులు
11. పీచు పదార్థాలు లభించే ఆహారం?
1) బీరకాయ 2) బెండకాయ
3) చిలగడ దుంప 4) పైవన్నీ
12. ఫలాలను, కూరగాయలను తినడం వల్ల స్కర్వీ వ్యాధిని నివారించవచ్చని తెలిపింది?
1) లెవోయిజర్ 2) కాస్మిర్ ఫంక్
3) జేమ్స్లిండ్ 4) లూయీ పాశ్చర్
13. కొవ్వు పదార్థాల పరీక్షకు కావలసింది?
1) తెల్ల కాగితం 2) అయోడిన్
3) సోడియం హైడ్రాక్సైడ్
4) కాపర్ సల్ఫేట్
14. అయోడిన్‌ను ఏ పరీక్షకు ఉపయోగిస్తారు?
1) ప్రొటీన్ల పరీక్ష
2) పిండి పదార్థాల పరీక్ష
3) కొవ్వుల పరీక్ష
4) ఖనిజ లవణాల పరీక్ష
15. ఎలుకల నివారణకు ఉపయోగించే మందు?
1) పెన్సిలిన్ 2) జింక్ ఫాస్ఫైడ్
3) వార్ఫరిన్ 4) 2, 3
16. ధాన్యం నిల్వ చేసే ప్రదేశాల్లో చీడ పురుగుల నివారణకు ఉపయోగించే కీటక నాశక పదార్థం?
1) డీడీటీ 2) మలాథియాన్
3) 1, 2 4) పైరిధ్రిన్
17. పొడ బారించే పద్ధతిలో కీటకాలను నాశనం చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థం?
1) ఇథైలిన్ డైబ్రోమైడ్
2) అల్యూమినియం పాస్ఫైట్
3) 1, 2 4) జింక్ పాస్ఫైట్
18. ఏ సంవత్సరంలో జేమ్స్లిండ్ స్కర్వీ వ్యాధి నివారణకు తాజా ఫలాలను, కూరగాయలను తినటం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నారు?
1) 1652 2) 1752
3) 1852 4) 1952
1. ఆకు కూరలకు సంబంధించి కింది వాటిలో సరైనది?
1) వీటిలో ఐరన్ ఉంటుంది
2) రక్తకణాలు, రక్తం ఉత్పత్తికి తోడ్పడతాయి
3) విటమిన్ – ఎ తోపాటు పీచు పదార్థాలు ఉంటాయి
4) పైవన్నీ సరైనవే
2. గుడ్డు సంపూర్ణ ఆహారమే కానీ దీనిలో ఏవి లోపించి ఉంటాయి?
1) పిండి పదార్థం 2) మాంసకృత్తులు
3) కొవ్వులు 4) 2, 3
3. అత్యధిక ప్రొటీన్లు దేనిలో ఉంటాయి?
1) చిక్కుడు 2) సోయా చిక్కుడు
3) బఠాణీ 4) వేరుశనగ
4. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 2002, ఫిబ్రవరి 2 2) 2002, జనవరి 2
3) 2003, జనవరి 2 4) 2004, జనవరి 2
5. పుట్టిన ప్రతి పిల్లవాడికి ఏ హక్కు ఉంటుంది?
1) ఆరోగ్యంగా జీవించే హక్కు
2) పౌష్టికాహారం పొందే హక్కు
3) 1, 2 4) ప్రేమించే హక్కు
6. ఆహారంలో ప్రొటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధి?
1) మరాస్మస్ 2) క్వాషియోర్కర్
3) స్థూలకాయత్వం 4) రికెట్స్
7. కింది వాటిలో ప్రొటీన్స్, క్యాలరీస్ రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి?
1) క్వాషియోర్కర్ 2) వర్ణాంధత్వం
3) మరాస్మస్ 4) స్థూలకాయత్వం
8. శరీరంలో అధిక కొవ్వు నిల్వ చేసే భాగం?
1) ఎడిపోజ్ కణజాలం 2) కాలేయం
3) మూత్ర పిండాలు 4) హృదయం
9. ఎన్ని నక్షత్రాలు ఉన్న రిఫ్రిజిరేటర్లు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయి?
1) 2 2) 3 3) 4 4) 5
10. ప్రొటీన్స్ ఎక్కువగా ఏ కుటుంబపు మొక్కల్లో ఉంటాయి?
1) మోరేసి 2) మాల్వేసి
3) ఫాబేసి 4) అనకార్డియేసి
11. సాలడ్ అనే పదం సాలటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలటా అంటే?
1) పప్పు 2) ఉప్పు
3) తుప్పు 4) ముప్పు
12. జతపరచండి.
1. చికోరి ఎ. పిండిపదార్థం
2. బీట్రూట్ బి. ఎండు పళ్లు
3. ఉప్పు సి. సుగంధ ద్రవ్యం
4. లవంగం డి. ఖనిజం
5. కిస్మిస్ ఇ. జీర్ణం
1) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-సి, 5-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి, 5-ఇ
4) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ
13. జతపరచండి.
1. కార్బోహైడ్రేట్లు ఎ. నూనెమరక
2. ప్రొటీన్లు బి. అయోడిన్
3. లిపిడ్లు సి. ముదురు నీలిరంగు
4. విటమిన్లు డి. తృణ ధాన్యాలు
5. పీచు పదార్థం ఇ. తక్కువ పరిమాణం
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-డి
3) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-సి, 5-బి
4) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ
14. జతపరచండి.
1. కార్బోహైడ్రేట్లు ఎ. నెయ్యి
2. ప్రొటీన్లు బి. బంగాలదుంప
3. లిపిడ్లు సి. కందిపప్పు
4. విటమిన్లు డి. బీరకాయ
5. పీచు పదార్థం ఇ. నిమ్మ, ఉసిరి
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-డి
3) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-సి, 5-బి
4) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ
15. జతపరచండి.
1. క్యాబేజీ ఎ. మొగ్గ
2. ఇంగువ బి. రిసెన్
3. ఉల్లి సి. భూగర్భ కాండం
4. చెరకు డి. కాండం
5. క్యారెట్ ఇ. వేరు
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-డి
3) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-సి, 5-బి
4) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ
సమాధానాలు
1.2 2.4 3.3 4.4
5.1 6.3 7.2 8.3
9.1 10.2 11.3 12.1
13.2 14.1 15.2 16.3
17.4 18.3 19.3 20.2
21.2 22.1
సమాధానాలు
1.1 2.3 3.4 4.3
5.2 6.4 7.3 8.1
9.2 10.2 11.4 12.3
13.1 14.2 15.4 16.3
17.3 18.2
సమాధానాలు
1.4 2.1 3.2 4.3
5.3 6.2 7.3 8.1
9.4 10.3 11.2 12.1
13.2 14.3 15.4
-స్రవంతి
ఏకేఆర్ స్టడీ సర్కిల్,వికారాబాద్