ఇన్‌స్టాలో వ్యూస్, లైక్స్ కోసం కొందరు యువత ప్రాణాలకు తెగించి రీల్స్ చేస్తున్నారు. పుణెకు చెందిన ఇద్దరు టీనేజర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎత్తయిన భవనం పైనుంచి వేలాడుతూ చేసిన ఫీట్ ఇప్పుడు ఎక్స్‌లో వైరల్‌గా మారింది. ఒక ఎత్తయిన భవనం పైభాగం నుంచి ఒక యువతి గాలిలో వేలాడుతుండగా, ఆమె చేతిని యువకుడు పట్టుకుని ఆపాడు. అక్కడే ఉన్న మరో యువకుడు దీనిని కెమెరాలో బంధిస్తున్నాడు. ఈ దృశ్యం చూసే వారికి భీతి పుట్టిస్తున్నది. అతని చేయి జారి ఆమె కిందపడితే ప్రాణాలు గల్లంతే. ఇలాంటి ఫీట్లు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.