Rolex Promo Released | విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. తమిళంలో ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీహిట్గా నిలిచింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా రోలెక్స్ ప్రోమోను విడుదల చేశారు.
ఈ సినిమా విజయంలో హీరో సూర్యకు కూడా కొంత వరకు క్రెడిట్ దగ్గుతుంది. రోలెక్స్ అనే విలన్ పాత్రలో సూర్య జీవించాడు. కనిపించేది ఐదు నిమిషాలే అయిన తన అద్భుత నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. నిజానికి ఈ సీన్ కోసమే కొందరు మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వెళ్తున్నారు. అంతలా సూర్య పాత్ర ప్రేక్షకులలో ఇంపాక్ట్ చూపించింది. ఈ ఒక్క సీన్ చాలు సూర్య ఎంత గొప్ప నటుడో చెప్పడానికి. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫాహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.