మీరేం మాకేం
అ ఆలు నేర్పాల్సిన అవసరం లేదు!
మీరు మాకేంఅన్నప్రాశన చేయాల్సిన పనిలేదు!
మేమేం అంబాడటం లేదు
మేమేం అడుక్కు తినటం లేదు
మా గంజే మాకు తీర్థం
మా గట్కే మాకు ప్రసాదం!
ఎవరి అలవాటు వాళ్ళది
ఎవరి ఇలవేల్పు వాళ్ళది
దానాన్ని కోరటం కాదు
ధాన్యాన్ని కొనమనటం
కోరిక వమ్ము చేయటం కాదు
కష్టార్జితం అమ్ముకోవటం
దెప్పి పొడవటం కాదు
కనువిప్పుడు కలగటం
ఎవరి నూకలు వారివి
ఎవరి కేకలు వారివి
ఎవరి ఆత్మగౌరవం వారిది
ఎవరి అభిమానం వారిది
కూట్లే మన్ను వోసేవాళ్ళ
నోట్లే దుమ్ముగొట్టేవాళ్ళ
పెత్తనమొద్దు
పెద్దరికమొద్దు
ఎవరి కూడు వారిది
ఎవరి గోడు వారిది
ఎవరి తోడు వారిది
ఎవరి గూడు వారిది
–కందుకూరి శ్రీరాములు
94400 19245