Lok Sabha | లోక్‌సభ (Lok Sabha)లో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక సందర్భంగా ఇరువురు నేతల మధ్య ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
దేశ చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. సభ ప్రారంభం కాగానే ఎన్డీయే కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్ సింగ్ సహా మంత్రులు, ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేశ్ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువాణీ ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ బర్తృహరి మహతాబ్ ప్రకటించారు.
ఈ ప్రకటన అనంతరం 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు స్వాగతం పలికేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి ప్రధాని మోదీ ట్రెజరీ బెంచీల ముందు వరుసలో ఉన్న బిర్లా సీటు వద్దకు వెళ్లారు. సభాపతిగా ఎన్నికైనందుకు ఓంబిర్లాకు ముందుగా మోదీ, కిరణ్ రిజుజు అభినందనలు తెలిపారు. ఇక అప్పుడే రాహుల్ కూడా అక్కడికి వచ్చి నూతన స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంటనే పక్కనే ఉన్న మోదీకి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఓంబిర్లాను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చో బెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#WATCH | Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany Lok Sabha Speaker Om Birla to the chair. pic.twitter.com/3JfKbCH3nC
— ANI (@ANI) June 26, 2024
#WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.
Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d
— ANI (@ANI) June 26, 2024
Also Read..
Speaker election | స్పీకర్ ఎన్నికలో ఓటు వేయలేకపోయిన ఏడుగురు ఎంపీలు..!
Om Birla | లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓంబిర్లా.. మూజువాణీ ఓటుతో ఇండియా కూటమి అభ్యర్థిపై గెలుపు
Arvind Kejriwal | కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ ఉపసంహరణ