Brahmaputra River : ఈశాన్య రాష్ట్రం అసోంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల ఇండ్లు నీట మునిగాయి. పంట పొలాలు దెబ్బతిన్నాయి. పలు ఏరియాలు తటాకాలను తలపిస్తున్నాయి.
రహదారులపై వరదలు పోటెత్తి నదులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరదల కారణంగా బ్రహ్మపుత్ర నదికి వరద పెరిగింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దాంతో నదీ పరివాహన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు.
#WATCH | Dibrugarh, Assam: As the water level rises in River Brahmaputra, the river crosses the danger level. pic.twitter.com/llAiXPVzri
— ANI (@ANI) June 30, 2024
#WATCH | Dibrugarh, Assam: As the water level rises in River Brahmaputra, the river crosses the danger mark. pic.twitter.com/KxvEHAW7Ux
— ANI (@ANI) June 30, 2024