Delhi airport | ఢిల్లీ విమానాశ్రయం (Delhi airport)లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలిపోయి కార్లపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో టెర్మినల్ 1 (Terminal-1)ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి (Union Minister of Civil Aviation ) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu Kinjarapu) సందర్శించారు.
కూలిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఘటనలో మృతి చెందిన వారికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్ట్ వెలుపల ఉన్న కొంత భాగం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఫైర్ సేఫ్టీ టీమ్‌లు ఘటనాస్థలం వద్ద అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టెర్మినల్‌ను మూసివేశాం. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. కూలిపోయిన భవనం పాతది. 2009లో ప్రారంభించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నాం. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం’ అని కేంద్రం మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలిపోయి కార్లపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టెర్మినల్-1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడింది. అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా చెకిన్ కౌంటర్లు మూసివేశామని చెప్పారు.
#WATCH | Union Minister of Civil Aviation Ram Mohan Naidu Kinjarapu says, “…A section of the canopy which is outside of the airport has collapsed due to heavy rains. We express our condolence to the life that has been lost in this tragic incident, four people have also been… https://t.co/8Bs7Jm5A1Z pic.twitter.com/gmArDd6ydz
— ANI (@ANI) June 28, 2024
Also Read..
Delhi Rain | ఢిల్లీలో భారీ వర్షం.. 1936 తర్వాత జూన్ నెలలో అత్యధిక వర్షపాతం
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు