Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM)గా మరోసారి హేమంత్ సొరేన్ (Hemant Soren) బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హేమంత్ సోరెన్‌కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది (Governor has invited). దీంతో హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి జేఎంఎం (JMM) ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7న హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం (swearing in ceremony) ఉంటుందని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తాజాగా వెల్లడించారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మమ్మల్ని ఆహ్వానించారు. జులై 7న ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది’ అని తెలిపారు.
The Governor has invited us to form the government. The swearing-in ceremony will be held on July 7: Supriyo Bhattacharya, General Secretary, Jharkhand Mukti Morcha (JMM) https://t.co/vg50T7qKSN
— ANI (@ANI) July 4, 2024
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన హేమంత్ సొరేన్ జూన్ 28న బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం లాంఛనం అయ్యింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా హేమంత్ సొరేన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరారు. గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
చంపయీ సొరేన్ రాజీనామా
తన అరెస్టు ఖాయం కావడంతో జనవరి 31న హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 2న జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సీనియర్ నేత చంపయీ సొరేన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. హేమంత్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతుండటంతో బుధవారం చంపయీ సొరేన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి నిర్ణయం మేరకు రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.
సుప్రీంకోర్టుకు ఈడీ!
హేమంత్ సొరేన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును త్వరలో సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు తెలిపాయి. ఈ మేరకు త్వరలోనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే సుప్రీంకోర్టు తీర్పుపై జార్ఖండ్ రాజకీయాలు ఆధారపడే అవకాశం ఉంది. కాగా, హేమంత్ సొరేన్ నేరం చేశారని నమ్మడానికి ఆధారాలు కనిపించడం లేదని జార్ఖండ్ హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Also Read..
Bridge Collapses | బీహార్‌లో కూలిన మరో వంతెన.. 15 రోజుల్లో పదో ఘటన
Team India | ప్రధాని మోదీతో ముగిసిన టీమ్ ఇండియా క్రికెటర్ల భేటీ.. ముంబైకి పయనం
Thief | ఇంటిని దోచుకుని.. నెలలో తిరిగిచ్చేస్తానంటూ లేఖ రాసిన దొంగ