Stuffed Idli : సౌత్ ఇండియన్ రెసిపీల గురించి మాట్లాడితే ఇడ్లీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. పొడి ఇడ్లీ, నేతి ఇడ్లీ నుంచి ఓట్స్ ఇడ్లీ వరకూ ఇడ్లీలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అయితే ఇడ్లీలో డెడ్లీ కాంబినేషన్లా ఇప్పుడు స్టఫ్డ్ ఇడ్లీ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. చిత్రవిచిత్ర ఫుడ్ కాంబినేషన్లను టేస్ట్ చేసే వారు ఇప్పుడు ఇడ్లీని కూడా విడిచిపెట్టలేదు.
యాపిల్ ఇడ్లీ, బర్గర్ ఇడ్లీ సహా పలు ప్రయోగాలు చేసిన జనాలు కొత్తగా ఈ ట్రెండ్‌కు స్టఫ్డ్ ఇడ్లీని జోడించారు. స్టఫ్డ్ ఇడ్లీ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో స్ట్రీట్ వెండార్ తొలుత ప్లేట్లో ఇడ్లీ పిండిని వేసి దానిపై తండూరీ సాస్, ఆనియన్స్, టొమాటాలు, క్యాప్సికమ్ కార్న్, వైట్ సాస్ వేయడం కనిపిస్తుంది.
ఆపై ట్రేను ఏడెనిమిది నిమిషాల పాటు ఓవెన్లో ఉంచి అనంతరం ఇడ్లీలు ఉడకగానే వాటిని పేపర్ ప్లేట్‌పై సర్వ్ చేస్తాడు. స్టఫ్డ్ ఇడ్లీ ఇన్ నాగపూర్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 12 లక్షల మంది వీక్షించారు. ఈ యూనిక్ కాంబోపై ఇడ్లీ ప్రేమికులు పెదవివిరిచారు. ఇదేం కాంబినేషన్ అంటూ పలువురు విరుచుకుపడ్డారు.
Read More :