Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Shaurya Commandos: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు కొత్త తరహా దళాన్ని క్రియేట్ చేశారు. శౌర్య కమాండోల(Shaurya Commandos)ను సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు ఐటీబీపీ పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాల్లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాల్ని శౌర్య కమాండోలు అడ్డుకున్నట్లు ఐటీబీపీ చీఫ్ శత్రుజీత్ సింగ్ కపూర్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు కొత్త తరహా దళాన్ని క్రియేట్ చేశారు. శౌర్య కమాండోల(Shaurya Commandos)ను సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు ఐటీబీపీ పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాల్లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాల్ని శౌర్య కమాండోలు అడ్డుకున్నట్లు ఐటీబీపీ చీఫ్ శత్రుజీత్ సింగ్ కపూర్ తెలిపారు. చైనాలో సుమారు 3488 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉందని, అయితే యుద్ధ సంసిద్ధతలో భాగంగా ఆ బోర్డర్ వెంట శౌర్య కమాండో బెటాలియన్లను మోహరించనున్నట్లు కపూర్ తెలిపారు. ప్రస్తుతం అత్యాధుక యుద్ధ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగిన రీతిలో దళాలను మోహరిస్తున్నట్లు చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాల్లో చైనీస్ ఆర్మీ నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయని, కానీ శౌర్య కమాండోలు వాటిని ఎదుర్కొన్నట్లు కపూర్ తెలిపారు. అక్టోబర్ 24వ తేదీన 65వ రైజింగ్ డే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. చైనాను ఎదుర్కొనేందుకు సంప్రదాయ యుద్ధ విద్యలు సరిపోవు అని, భారత్ ఈ రంగంలో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.
డ్రోన్ ప్లాటూన్లను ఐటీబీపీ దళాలు డెవలప్ చేశాయి. డ్రోన్ల ఆపరేషన్‌తో పాటు టెక్నాలజీ అభివృద్ధిపై ఆ దళాలకు శిక్షణ ఇస్తున్నారు. ఐటీబీపీకి 400 కోట్లును ప్రభుత్వం కేటాయించిందని, దాంట్లో డ్రోన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు 70 శాతం బడ్జెట్‌ను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. గల్వాన్ దాడి లాంటి ఘటనలను ఎదుర్కొనేందుకు స్ట్రయిక్ కోర్సులను డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు.
🇮🇳 ITBP DG Confirms Face-Offs at Multiple Locations in Arunachal Pradesh
ITBP Director General has officially confirmed ongoing face-offs at multiple locations in Arunachal Pradesh, praising the courage and operational performance of the force’s Shaurya Commando platoons.
#ITBP #ArunachalPradesh #ShauryaCommandos #BorderSecurity #IndianDefence #RakshaSamachar— Raksha Samachar | रक्षा समाचार 🇮🇳 (@RakshaSamachar) October 23, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

