PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో పర్యటించబోతున్నారు. వచ్చే డిసెంబర్ 11, 12 తేదీల్లో ఆయన కెనడాలో పర్యటిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో పర్యటించబోతున్నారు. వచ్చే డిసెంబర్ 11, 12 తేదీల్లో ఆయన కెనడాలో పర్యటిస్తారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కెనడా (ఒట్టావా)లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం దీనిపై ప్రకటన చేసింది. ప్రధాని పర్యటన ఖరారైందని తెలిపింది. మోదీ తన పర్యటనలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రెండు దేశాధినేతలు అంగీకరించారని భారత్ తెలిపింది.
మోదీ పర్యటన ద్వైపాక్షికంగా కీలక మలుపుగా అభివర్ణించింది. ఈ పర్యటనలో వ్యాపారం, వాణిజ్యం, ఎనర్జీ, టెక్నాలజీ, భద్రతతోపాటు పౌరుల సేవలు వంటి అంశాలపై మోదీ, కార్నీ చర్చిస్తారు. మోదీ పర్యటన గురించి కార్నీ కూడా ఇటీవల వెల్లడించారు. గురువారం ఆయన ఒక రెస్టారెంట్లో అక్కడి ప్రజలతో మాట్లాడుతూ మోదీ పర్యటనను ఖాయం చేశారు. అమెరికాకు పొరుగునే ఉన్న కెనడా.. ఇండియా వ్యాపారాలకు, ఇతర ద్వైపాక్షిక సంబంధాలకు చాలా కీలకం. ప్రస్తుతం అమెరికాతో వ్యాపారం, వాణిజ్యం విషయంలో ఇండియా పలు ఇబ్బందులు ఎదుర్కుంటోంది.
ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, వాణిజ్య ఒప్పందం విషయంలో ఇంకా తుది నిర్ణయం ఖరారు కాకపోవడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి తరుణంలో మోదీ కెనడాలో పర్యటించడం ఇండియాకు చాలా మేలు చేస్తుందనేది విశ్లేషకుల మాట. మరోవైపు.. కెనడా-ఇండియా మధ్య కూడా త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య 2030 నాటికి 70 బిలియన్ అమెరికన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరగాలన్నది తమ లక్ష్యమని కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్ధు ఇటీవల వెల్లడించారు.
మోదీ తన పర్యటన ఖరారు కావడానికి ముందు.. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో గత మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం, వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపు కోసం చర్చలు జరిపామని మోదీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

