High Tide : దేశవ్యాప్తంగా నిన్నమొన్నటి వరకూ వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు వర్షాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. పలు నగరాలను భారీ వర్షాలు ముంచెత్తగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైనీ వర్షాలు పలకరించాయి. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరైన ముంబై వాసులకు కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు రిలీఫ్ ఇచ్చాయి. తుఫాన్ హెచ్చరికలతో అరేబియా సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి.
#WATCH | Maharashtra: People gather at Mumbai’s Marine Drive to witness high tide. pic.twitter.com/hVjZvm6Zyv
— ANI (@ANI) June 30, 2024
ముంబైలోని మెరైన్ డ్రైవ్ బీచ్‌లో అలలు ఎగిసిపడుతుండటంతో స్ధానికులతో పాటు పెద్దసంఖ్యలో పర్యాటకులు బీచ్ ప్రాంతానికి చేరుకుని సేద తీరుతున్నారు. బీచ్ అందాలను ఆస్వాదిస్తూనే అలల అలజడిని వీక్షించారు. సెలవుదినం కావడంతో పెద్దసంఖ్యలో టూరిస్టులు, నగరవాసులు సిటీలోని బీచ్‌లకు పోటెత్తారు.
Read More :
Bridge Collapses | నిన్న బిహార్‌లో.. నేడు జార్ఖండ్‌లో కూలిన వంతెన..!