న్యూఢిల్లీ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో 84,106 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. రెండు బలగాలలో మొత్తం 10,45,751 సిబ్బందికి గాను ఈ ఏడాది జూలై 1 నాటికి 84 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి మద్య 67,345 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని, మరో 64,091 ఖాళీల భర్తీకి చేపట్టిన ప్రక్రియ వివిధ దశలలో ఉందని చెప్పారు.