COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
COVID New Variant | కొవిడ్-19 కొత్త వేరియంట్ పీజే.2.1 అనేక దేశాలకు విస్తరించింది. దీనిని మొదట ఈ ఏడాది మే నెలలో కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో గుర్తించారు.
COVID New Variant | న్యూఢిల్లీ : కొవిడ్-19 కొత్త వేరియంట్ పీజే.2.1 అనేక దేశాలకు విస్తరించింది. దీనిని మొదట ఈ ఏడాది మే నెలలో కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో గుర్తించారు. ఇది ఉత్తర అమెరికా, యూరోప్, ఆసియా, ఓషియానియాలలో పెరుగుతుండటంతో పరిశోధకులు దీని జన్యుపరమైన మార్పులు, మానవ కణాల్లో చేరే సామర్థ్యం గురించి పరీక్షిస్తున్నారు. గత నెలలో ‘ఇన్ఫెక్షన్’ జర్నల్‌లో ప్రచురితమైన ప్రాథమిక నివేదిక ప్రకారం, మానవ కణాల్లోకి ప్రవేశించగలిగే సామర్థ్యం పీజే.2.1కు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
దీనికి తగిన క్లినికల్ ఆధారాలు ప్రస్తుతం లేవు. ఈ వైరస్ మ్యుటేషన్లకు ప్రత్యేక లక్షణాలను కూడా పరిశోధకులు ఇంకా గుర్తించలేదు. కొవిడ్-19 లక్షణాల మాదిరిగానే జ్వరం, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా ఉండవచ్చునని, అందువల్ల కేవలం లక్షణాల ఆధారంగా అస్వస్థతకు కారణాన్ని గుర్తించడం సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

