NEET-UG 2024 | నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయని, ప్రశ్నాపత్రం లీకైందని విద్యార్థులు, విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరో సంగతి బయట పడింది. ఎంబీబీఎస్ సహా పలు వైద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ’ పరీక్షకు పటిష్ట భద్రత ఉంటుంది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సునిశిత తనిఖీలు ఉంటాయి. సీసీటీవీ కెమెరా నిఘా కూడా ఉంటుంది. కానీ గత నెల ఐదో తేదీన జరిగిన నీట్ యూజీ 2024 పరీక్షలో నిబంధనలు పాటించలేదని తెలుస్తున్నది. నీట్ నిర్వాహక సంస్థ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన థర్డ్ పార్టీ సమీక్షలో ఈ సంగతి వెల్లడైంది.
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద రెండు సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రశ్నాపత్రాలు నిల్వ ఉంచిన కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు ఉండాలి. కానీ ఈ సారి నీట్ పరీక్ష నిర్వహణలో ఈ నిబంధనలకు నీళ్లు వదిలారని తెలుస్తున్నది. పలు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, ప్రశ్నా పత్రాల నిల్వ కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డుల భద్రత లేదు. దేశవ్యాప్తంగా 4000 పరీక్షా కేంద్రాలకు గాను 399 పరీక్షా కేంద్రాలను థర్డ్ పార్టీ పర్యవేక్షకులు పరిశీలించారు.
కానీ 399 పరీక్షా కేంద్రాల్లో 186 కేంద్రాల్లో ప్రతి పరీక్షా రూమ్ వద్ద రెండు సీసీటీవీ కెమెరాలూ లేనే లేవు. ఈ సీసీటీవీ కెమెరాలను కేంద్రంలోని ఎన్టీఏ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేస్తారు. 399 పరీక్షా కేంద్రాల్లో 68 చోట్ల స్ట్రాంగ్ రూమ్ ల వద్ద గార్డుల భద్రతే లేదు. విద్యార్థులకు పరీక్షా పత్రాలు పంపిణీ చేసే వరకూ ఈ గార్డుల భద్రత తప్పనిసరి. మరో 83 పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల బయో మెట్రిక్ స్టాఫ్, పరీక్షా కేంద్రాల్లో నియమించిన స్టాఫ్ వేర్వేరుగా ఉన్నారని తేలింది. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తనిఖీలు, అందుకు అవసరమైన జామర్లు ఏవీ కనిపించలేదని తేలింది.
ఇదిలా ఉంటే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బీహార్లో ప్రశ్నాపత్రం లీకైందని తేలింది. తమకు పరీక్షకు ముందు రోజు రాత్రి ప్రశ్నాపత్రం అందిందని బీహార్ రాష్ట్రంలో అరెస్టయిన విద్యార్థులు.. పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఈ పరీక్ష పత్రం లీక్ సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ.32 లక్షల వరకూ వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Oppo A3 Pro | ఒప్పో నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold-Silver Rates | భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు.. యూఎస్ ఫెడ్ రిజర్వుపైనే ఆశలు..!
Petrol Rates – Goa | గోవాలో పెట్రోల్, డీజిల్ పిరం.. సామాన్యులకు బీజేపీ సర్కార్ షాక్