లక్నో: ఐదేళ్ల బాలుడిపై కోతులు దాడి చేశాయి. (Monkeys Attacks Boy) ఆ చిన్నారిని నేలపైకి నెట్టి ఈడ్చుకెళ్లాయి. ఇది చూసి అక్కడున్న మహిళలు భయాందోళన చెందారు. అయితే కొందరు వ్యక్తులు పరుగున అక్కడికి రావడంతో ఆ బాలుడ్ని కోతులు విడిచిపెట్టాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ సంఘటన జరిగింది. జూలై 12న బృందావన్‌లోని మదన్ మోహన్ ఘెరా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల కిషన్ తన తండ్రి గోపాల్ కోసం ఏదో తెచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
కాగా, మదన్ మోహన్ గుడి మెట్ల వద్దకు ఆ బాలుడు రాగానే అక్కడున్న నాలుగు కోతులు దాడి చేశాయి.
పిల్లవాడ్ని నేలకు నెట్టి ఈడ్చేందుకు ప్రయత్నించాయి. ఇది చూసి అక్కడున్న మహిళలు భయాందోళన చెందారు. వారు అక్కడి నుంచి వెనక్కి వెళ్లారు. ఇంతలో కొందరు వ్యక్తులు పరుగున ఆ బాలుడి వద్దకు వచ్చారు. దీంతో కోతులు ఆ చిన్నారిని విడిచి పారిపోయాయి. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मथुरा में बंदरों का आतंक, 5 साल के मासूम बच्चे पर बंदरों ने किया अटैक, स्थानीय लोगों ने दौड़कर बचाई बच्चे की जान, लाइव घटना सीसीटीवी में कैद@dmmathura7512 pic.twitter.com/nUjbATcbd0
— Pramod Kumar (@journalistpk123) July 13, 2024