Lashkar Terrorist: లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
Lashkar Terrorist: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో లష్కరే ఉగ్రవాది (Lashkar Terrorist)లతీఫ్ భట్ హతమయ్యాడు. మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. గడిచిన వారం కుల్గాంలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ గ్యాంగ్‌లో లతీఫ్ భట్ ఉన్నాడు. ఆర్మీ, భద్రతా దళాలు ఎన్కౌంటర్ ప్రదేశాన్ని సీజ చేశాయి. ఆర్మీతో పాటు జేకే స్పెషల్ ఆపరేషన్ గ్రూపు ఎలైట్ దళాలు తాజా ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి.
ఉగ్రవాది భట్.. కుల్గాం నివాసితుడు. పాకిస్థానీ ఉగ్రవాదులతో కలిసి అతను పనిచేస్తున్నాడు. దక్షిణ కశ్మీర్‌లోని హైడౌట్ ప్రాంతాల్లో అతను తిరుగుతున్నట్లు గుర్తించారు. ఓవర్‌గ్రౌండ్ వర్కర్లతో అతనికి నెట్వర్క్ ఉన్నది. 2026లో ఉగ్రదాడుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. అనంత్‌నాగ్‌లోని లాల్ చౌక్ ఏరియాలో ఓ కానిస్టేబుల్‌ను చంపిన కేసు, కుల్గాంలో జూలై 31న శరణార్థి హత్య కేసులో భట్ నిందితుడిగా ఉన్నాడు.
నవంబర్ 11న కుల్గాంలో సీఆర్పీఎఫ్ పై దాడి చేసిన తర్వాత ఇద్దరు ఎస్పీవోలను ఉగ్రవాదులు హతమార్చారు. వరుసగా రెండు దాడి ఘటనలు చోటుచేసుకోవడంతో కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదం పెరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
Lashkar Terrorist: లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
NIMS Staff | హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగి
తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. పట్టించుకోని సింగరేణి అధికారులు
‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

