తిరువనంతపురం, జూలై 2: మైనర్ అయిన కూతురిపై ఆరేండ్లపాటు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కేరళలోని ఒక కోర్టు 101 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దయ చూపడానికి దోషి అనర్హుడని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
తన తండ్రి ముహమ్మద్ తనపై పాల్పడిన అఘాయిత్యాల గురించి బాధితురాలు 16 ఏండ్ల వయసులో గర్భం దాల్చిన తర్వాత బయటకు వెల్లడించింది. తండ్రులందరూ తమ కూతుళ్లతో ఇలాగే ప్రవర్తిస్తారని దోషి తన కూతురితో చెప్పినట్టు తెలుస్తున్నది.