Google Maps | కాసర్‌గఢ్: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని ప్రయాణం చేసిన ఇద్దరు యువకులు నదిలోకి కారును పోనిచ్చి చిక్కుకుపోయారు. అయితే అదృష్టవశాత్తు కారు చెట్టులో ఇరుక్కుపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
అబ్దుల్ రషీద్, మరో యువకుడు కర్ణాటకలోని దవాఖానకు ఆదివారం తెల్లవారుజామున కేరళ నుంచి కారులో వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్స్ సహాయంతో వెళ్తుండగా, నదిని రోడ్డు అనుకుని అందులోకి కారు డ్రైవ్ చేయడంతో కారు నీట మునిగి కొట్టుకుపోవడం ప్రారంభించింది. అయితే కారు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బతికిపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తాడు సహాయంతో వీరిని రక్షించారు.