Hemant Soren : జార్ఖండ్‌లో మహాకూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ అన్నారు. జార్ఖండ్ ప్రయోజనాల కోసం అన్ని పనులను తమ ప్రభుత్వం చేపడుతున్నదని చెప్పారు. జార్ఖండ్ 13వ సీఎంగా ఆయన గురువారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీవీ రాధాకృష్ణన్ సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.
అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. చంపై సోరెన్ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి ఆయనకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. సోరెన్ సీఎంగా ప్రమాణం ప్రమాణం చేయడం ఇది మూడోసారి. కేవలం సోరెన్ మాత్రమే ప్రమాణస్వీకారం చేయగా.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనున్నది.
సీఎం పదవి నుంచి వైదొలిగిన చంపై సోరెన్ ఇకపై కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారనున్నారు. నిన్న జరిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా సమావేశంలో శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్‌ను నియమించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్, భార్య కల్పనా సోరెన్ సమావేశానికి హాజరయ్యారు.
Read More :
Pawan Kalyan | ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై పవన్ కల్యాణ్ సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం