2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
2 AAP MLAs Quit | పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా ప్రకటన తర్వాత తమ శాసన సభ్యత్వాలకు వారు రాజీనామా చేశారు.
చండీగఢ్: పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా ప్రకటన తర్వాత తమ శాసన సభ్యత్వాలకు వారు రాజీనామా చేశారు. (2 AAP MLAs Quit) సనౌర్ నియోజకవర్గం ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా, సమానా నియోజకవర్గానికి చెందిన చేతన్ సింగ్ జోరా మజ్రా, పంజాబ్ అసెంబ్లీకి తమ రాజీనామాలను సమర్పించారు. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం అధికార పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.
కాగా, వరదల నిర్వహణ, తనపై నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు అంశాలపై ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా కొంతకాలంగా ఆప్ నాయకత్వాన్ని విభేదిస్తున్నారు. పంజాబ్ మాజీ మంత్రి అయిన మరో ఎమ్మెల్యే చేతన్ సింగ్ జోరా మజ్రా కూడా పార్టీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు.
మరోవైపు ఈ ఏడాది మే నెలలో శిరోమణి అకాలీ దళ్ మాజీ నాయకుడు సుర్జిత్ సింగ్ రాఖ్రా ఆప్‌లో చేరారు. సమానా నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అయిన జోరా మజ్రాను పక్కనపెట్టే ప్రయత్నంగా రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆప్‌లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- announced
- candidates list
- MLAs
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

