న్యూఢిల్లీ: వృద్ధుడైన రోగి హాస్పిటల్ బెడ్‌పై పడుకుని ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఒకరు ఆ రోగి వద్దకు వచ్చాడు. ఉన్నట్టుండి మోచేతితో వృద్ధుడి కడుపులో కొట్టాడు. (Hospital Staff Hits Elderly Patient) ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూన్ 19న ఈ సంఘటన జరిగింది. హాస్పిటల్ యూనిఫారం ధరించిన ఒక వ్యక్తి రోగి పడుకున్న బెడ్ వద్దకు వచ్చాడు. కర్టెన్ను జరిపాడు. వృద్ధుడైన రోగికి చాలా దగ్గరగా వచ్చాడు. కర్టెన్ను మూసిన తర్వాత మోచేతితో రోగి కడుపుపై కొట్టాడు.
కాగా, హాస్పిటల్ వార్డులో అమర్చిన సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ప్రొఫెసర్ సుధాంశు త్రివేది అనే యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో అన్నది వెల్లడించలేదు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
लोग डॉक्टर को भगवान का दर्जा दिए है
परंतु यहाँ डॉक्टर- शैतान का रूप में है देखिए 😳😳 pic.twitter.com/y8BrEj386x
— Prof. Sudhanshu Trivedi (@Sudanshutrivedi) June 24, 2024