Fire Breaks Out : చత్తీస్ఘఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సెంటర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
#WATCH | Fire breaks out in an automobile service centre in Chhattisgarh’s Raipur pic.twitter.com/FieGCqNV5s
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 5, 2024
అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందగానే ఘటనా స్ధలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ప్రమాదానికి కారణాలు ఇతర సమాచారం వెలుగుచూస్తుందని అధికారులు చెబుతున్నారు.
Read More :
Sonu Sood | కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో సోనూసూద్ సందడి.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తా అంటూ హామీ