ముంబై: రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్న వృద్ధుడ్ని ఒక కారు ఢీకొట్టింది. దీంతో అతడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (hit and run) సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మల్కాపూర్ మీదుగా వెళ్లే 53వ జాతీయ రహదారి పక్కగా ఒక వృద్ధుడు నడిచి వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన ఒక కారు అతడ్ని ఢీకొట్టింది. దీంతో గాలిలోకి ఎగిరి దూరంగా పడ్డాడు. కొంత దూరం ముందుకు వెళ్లిన కారును డ్రైవర్ ఆపాడు. చుట్టూ చూసిన తర్వాత కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడ్ని
బుద్రుక్కు చెందిన నామ్‌దేవ్ కవాలేగా గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఆ కారు గుజరాత్‌కు చెందినగా నంబర్ ప్లేట్ ద్వారా గుర్తించారు. వృద్ధుడ్ని ఢీకొట్టి పరారైన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महाराष्ट्र के मलकापुर में तेज रफ्तार कार ने बुजुर्ग शख्स को उड़ाया। बुजुर्ग शख्स की मौके पर ही मौत।@buldhanapolice1 आरोपी कार चालक की तलाश में जुटी। #Maharashtra @News18India @RoadsOfMumbai pic.twitter.com/fpV15fPVFP
— Diwakar Singh (@Diwakar_singh31) July 2, 2024