Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం వరకూ కల్తీసారా ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 58కి పెరిగినట్లు కళ్లకురిచి జిల్లా కలెక్టర్ ఎమ్ఎస్ ప్రశాంత్ (Collector MS Prashanth) తెలిపారు.
#UPADTE | Tamil Nadu | Death toll in the Kallakurichi Hooch Tragedy rises to 58: Kallakurichi District Collectorate
— ANI (@ANI) June 24, 2024
విళుపురం, కళ్లకురిచి, సేలం, పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 200 మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలువురు బాధితులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు కారకులైన 11 మందిని సీబీసీఐడీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Also Read..
Battery Plant | బ్యాటరీ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
Gujarat | ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. థార్ వాహనాలతో సముద్రంలోకి వెళ్లిన యువకులు.. తర్వాత ఏమైందంటే..?
Lok Sabha | లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేసిన తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు